Ammayi garu Serial Today Episode రూప, రాజులు వాళ్ల ఇళ్లలో ఒకరిని ఒకరు చూసినట్లు చెప్తారు. ఇన్నాళ్లు ఎక్కడుందో ఏం చేస్తుందో జాడే తెలియని రూప ఇప్పుడు కనిపించడం షాకింగ్‌గా ఉందని రాజు చెప్తాడు. ఇక రూప తండ్రితో రాజు మెకానిక్‌గా పని చేస్తున్నాడు అని కారు రిపేర్ చేశాడని చెప్తుంది. విజయాంబిక దీపక్‌తో రాజుని మర్చిపోతుందని అనుకుంటే రాగానే వాడి గురించి మాట్లాడుతుంది టాపిక్ మార్చేయాలని చెప్తుంది.
విరూపాక్షి: రూప నీ గురించే గ్యారేజ్‌కి వచ్చిందా నీతో ఏమైనా మాట్లాడిందా రాజు.
రాజు: లేదమ్మ గారు కారు పాడైతే రిపేర్ కోసం వచ్చింది.
సూర్య: రాజులో పశ్చాత్తాపం ఏమైనా కనిపించిందా అమ్మ. నిన్ను ఇన్ని రోజులు మిస్ అయిన బాధ కానీ కోపం కానీ ఏమైనా కనిపించాయా.
విజయాంబిక: తమ్ముడు వద్దని వదిలేసినోడికి బాధ ఎందుకు ఉంటుంది. అమ్మా రూప నిన్ను వదిలేసిన వాడు పెద్ద మోస గాడు అలాంటివాడి కోసం నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. నువ్వు న్యూయార్క్ వెళ్లినప్పుడు ఒక్క సారి కూడా మన ఇంటికి రాలేదు. అసలు నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నుంచే రాని వారి గురించి నువ్వు ఇంత ఆలోచించడం కూడా వేస్టే.
విరూపాక్షి: వదిలేయ్ రాజు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని పాతి పెట్టమన్నప్పుడే రూప లేదు అనుకున్నాం. వాళ్లు చంపేయాలి అనుకున్న బిడ్డని నువ్వు కాపాడుకున్నావ్. అలాంటిది వాళ్ల నీడ కూడా బంటి మీద పడకూడదు. అసలు వాళ్ల మాటలే వద్దులే. ఇంతకాలం రూప మన జీవితాల్లో లేదు అనుకున్నాం ఇకపై కూడా అంతే.
బంటీ: ఎవరు నాన్న రూప. మన ఇంటిలో ఎప్పుడూ ఈ పేరు వినలేదు ఈ రోజు ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్నారు.
రాజు: బంటీ పెద్దవాళ్ల మాటలు నీకు ఎందుకు ఇంకొక్క సారి ఇలా మాట్లాడితే పళ్లు రాలగొడతా వెళ్లు లోపలికి.
రోహిణి: బంటీ.. ఏంటి రాజు నువ్వు నీ కోసం బంటీ మీద చూపిస్తున్నావ్. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని చిన్న పిల్లలకు ఎలా తెలుస్తుంది. నువ్వు ఏడ్వకు బంటీ. నీ కోసం నీకు ఇష్టమైన చక్కర పొంగలి తీసుకొచ్చా పద తినిపిస్తా. పద..
రాజు బంటీని తిట్టినందుకు అందరూ ఎమోషనల్ అవుతారు. బంటీ ఏడుస్తాడు. రాజు చాలా ఫీలవుతారు. ఇక రూప కూడా రాజుని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. రోహిణి రాజుని ఓదార్చుతుంది. అమ్మ ఉంటే బాగుండేది అని బంటీ ఏడుస్తాడు. ఇక రోహిణి తననే అమ్మగా ఫీలవ్వమని అంటుంది. ఇకపై అమ్మ అని పిలవమని అంటుంది. బంటీ చాలా సంతోషిస్తుంది. నాన్న తిడతారు అంటే నాన్న లేనప్పుడు నీకు నచ్చినప్పు డు పిలవమని అంటుంది. బంటీ అమ్మ అని పిలవగానే రోహిణి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక సుమ రూపని ఓదార్చి చక్ర పొంగలి తినమంటుంది. ఇక విజయాంబిక రూపతో రాజు నిన్ను మర్చిపోయాడు నువ్వు మర్చిపో అంటుంది.
సూర్య రూపకి తినిపిస్తే రాజు బంటీ దగ్గరకు వెళ్తాడు. చక్ర పొంగలి తినిపిస్తే దానికి బాబు రాజుతో ఎవరు ఏమన్నా పర్లేదు కానీ నువ్వు ఏమన్నా ఏడుపొస్తుంది అని ఏడుస్తాడు. రాజు దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నా అని రూప తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. రాజు బాబుకి స్వీట్ తినిపిస్తే రూపకి తండ్రి తినిపిస్తాడు. అయిపోయిన దాని గురించి ఆలోచించవద్దని రాజు వల్లే బిడ్డ చనిపోయాడని సూర్యప్రతాప్ అంటాడు. రూప షాక్ అయి ఏమైందని అడిగితే బిడ్డ రిపోర్ట్ తెప్పించి చూశామని బిడ్డ హార్ట్‌లో హోల్ ఉందని అందుకే చనిపోయాడని చెప్తారు. దీనంతటికి రాజే పరోక్షంగా కారణం అని 9 నెలలు నువ్వు సంతోషంగా లేకుండా చేశాడని అంటారు. రూప చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!