మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సొంత పార్టీకే చెందిన నేత ఒకరు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. మంత్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. పోలీసుల ద్వారా తనను వేధిస్తున్నారని వాపోయాడా కౌన్సిలర్. 


మహబూబ్ నగర్ పట్టణంలోని రాంనగర్ 43వ వార్డ్‌ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఫిర్యాదులో శ్రీనివాస్ గౌడ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారాయన. 


మహబూబ్ నగర్‌‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్, అధికారులకు తాను ఫిర్యాదు చేశాననే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తనపై కక్ష పెంచుకున్నారని సుధాకర్ రెడ్డి చెప్పారు. అందుకే శ్రీనివాస్‌ గౌడ్‌ పోలీసులతో కుమ్మక్కై తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తనను హత్య చేయించాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ కోరారు.


మంత్రి సూచనల మేరకే పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. అంతేకాక, మంత్రి కేటీఆర్‌‌కు కూడా సుధాకర్ రెడ్డి విన్నవించుకున్నారు.


కౌన్సిలర్‌పైనే కేసు నమోదు
హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్​పై కొద్ది గంటల్లోనే రంగంలోకి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై విచారణ చేశారు రెవెన్యూ ఆఫీసర్లు. కౌన్సిలర్ భూ కబ్జా చేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంనగర్ హైస్కూల్​ఏరియాలో స్కూల్ జాగా కబ్జా అయిందని.. బురుజు సుధాకర్ రెడ్డి 680 గజాల స్థలాన్ని ఆక్రమించి ఫేక్​రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలిందని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు.


మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీ. ఆయన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మంత్రిపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం కాలనీ వాసుల నుంచి సుధాకర్​రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


Also Read: Bandi Sanjay: హైకోర్టులో బండి సంజయ్ కి ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం


Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !


Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !


Also Read: Cryptocurrency Prices Today, 05 January 2022: క్రిప్టో మార్కెట్లో వీడని స్తబ్దత! ఆచితూచి ఇన్వెస్టర్ల కొనుగోళ్లు