HarishRao ON Agnipath :  అగ్నిపథ్ స్కీం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీార్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలుచేస్తున్నారు.  ఆర్మీని ప్రయివేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు.  అగ్నిపథ్ తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతొందన్నారు.  రైల్వే స్టేషన్‌పై దాడుల వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తూండటాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాడుల వెనుక టిఆర్ఎస్ హస్తం ఉంటే యూపీ లో ఎవరి హస్తం ఉన్నట్లని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, డి కె అరుణ లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.


టీఆర్ఎస్‌ ఎంపీ ఫ్లెక్సీల్లో పవన్, చిరంజీవి - కేసీఆర్ ఫోటో కూడా లేదేంటి ?


అగ్నిపథ్ ను మార్చా లని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని పథ్ యువతకు  అర్థం కాలేదు అనడం హాస్యాస్ప దమని కేంద్రం నిర్ణయం తో దేశం లో అగ్గి అంటుకుంద న్నారు.బిజెపి ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. ఇక్కడ టీఆరెస్ పార్టీ చేయిస్తుందని అంటున్నారు మరి బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో ఎవరు చేయించారు అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. బిజెపి అన్ని రంగాలను ప్రయివేట్ పరం చేస్తోంది. చివరికి ఆర్మీని కూడా ప్రయివేట్ పరం చేస్తున్నారు. 


కాంగ్రెస్‌లోకి పీజేఆర్ కుమార్తె - టీఆర్ఎస్‌లో గుర్తింపు లేదని ఆరోపణ !


తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఉండదు. పొలాల్లో మీటర్లు వస్తాయి. పింఛన్లు ఉండవు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో 600 మించి పింఛన్లు లేవన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఉసురుపోసుకుంది. బిజెపి ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుందని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ స్కీమ్‌ను టీఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్‌ను రద్దు చేయాలన్న డమాండ్లు వినిపిస్తున్నారు. కాల్పుల ఘటనను కూడా ఖండించారు . కాల్పుల ఘటనలో చనిపోయిన వరంగల్ యువకుడి అంత్యక్రియల్లో కూడా టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 


సత్తుపల్లి టీఆర్ఎస్‌లో వర్గపోరు, సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర సర్దుబాటు చేసుకునేనా ?


ఇప్పటికే కేంద్రంపై వివిధ అంశాల్లో యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ ఇప్పుడు అగ్నిపథ్ స్కీం విషయంలోనూ తమ పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం తీరును ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ కూడా ఈ అంశంపై కేంద్రంపై ప్రెస్‌మీట్ పెట్టి విరుచుకుపడే అవకాశం ఉంది.