Vijayareedy iN Congress : టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిపారు. త్వరలో ఖైరతాబాద్‌లో సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.  మంచి భవిష్యత్తు కోసమే ... పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాని మీడియాకు విజయారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతూండటం..  సొంత ఇంటి పార్టీ లోకి వస్తున్న అనే భావన ఉందన్నారు.  టీ ఆర్ ఎస్ లో అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినా సరైన గుర్తింపు దక్కలేదని..  తనకు టీ ఆర్ ఎస్ ఒక బౌండరీ గీశారని తన శక్తి సామర్థ్యాలుచాటాలంటే..  కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని భావించానని ఆమె తెలిపారు.   ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ రాలేదు. ఎన్నికలకు టైం ఉంది కాబట్టి టికెట్ గురించి ఇప్పుడే మాట్లాడని ఆమె ప్రకటించారు. 


బొత్సకు విద్యాశాఖేనా పద్మశ్రీ కూడా ఇవ్వాలి - విజయనగరంలో చంద్రబాబు సెటైర్లు


విజయారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పీజేఆర్ కుమార్తె, ఆయన హఠాత్తుగా చనిపోవడంతో వారసుడిగా కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్ నియోజవర్గం విడిపోయింది. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గత రెండు సార్లు ఆయన ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. అయితే విజయారెడ్డి మొదట్లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ అవకాశాలు రావడం కష్టమని భావించి ఆమె టీఆర్ఎస్‌లో చేరారు. రెండు సార్లు ఖైరతాబాద్ టిక్కెట్ ఆశించినా ప్రయోజనం కలగలేదు. 


సత్తుపల్లి టీఆర్ఎస్‌లో వర్గపోరు, సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర సర్దుబాటు చేసుకునేనా ?


రెండు సార్లు ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు మేయర్ సీటును ఆశించారు. కానీ టీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించలేదు. ఇటీవల గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యలాపాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. టీఆర్ఎస్‌లో విజయారెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయాన్ని గమనించి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించగలిగినట్లుగా తెలుస్తోది.  


కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నుంచి  బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. పీజేఆర్‌కు అక్కడి బస్తీల్లో ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అన్న పేరుఉండేది.   పీజేఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్  ఖైరతాబాద్ నుంచి గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చివరి క్షణంలో దాసోజు శ్రవణ్ పోటీ చేశారు. ఈ సారి అక్కడ నాయకత్వ సమస్య ఉండటంతో విజయారెడ్డి తనకు చాన్స్ వస్తుందని భావిస్తున్నారు.