Top 5 Telugu Headlines Today 5 August 2023: 

పుంగనూరుకు ఎవరూ వెళ్లకూడదా ? ఏపీలో అదే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమా ?పుంగనూరు నియోజకవర్గం.  ఈ పేరు ఇటీవలి కాలంలో చాలా సార్లు  ప్రచారంలోకి వచ్చింది. అయితే అది అభివృద్ధి పనుల విషయంలో టామోటా పంటలను బాగా పండించిన విషయంలోనే కాదు.. రాజకీయ దాడుల విషయంలో. వైఎస్ఆర్‌సీపీ నేతలు కాకుండా మరే పార్టీ నేత అయినా సరే అక్కడ భయంతో బతకాల్సిందేనన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన నేతల్ని  మాత్రమే కాదు ఇటీవల కొత్తగా పార్టీ పెట్టుకున్న రామచంద్ర యాదవ్ అనే నేతనూ పుంగనూరులో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు వదల్దేదు. మాట్లాడితే ఇళ్లపై దాడులు చేస్తారు. ఆస్తులు ధ్వంసం చేస్తారు. ఊళ్లలోకి అడుగులు పెట్టనీయరు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలోనూ అదే జరిగింది. పుంగనూరులోకి చంద్రబాబును అడుగుపెట్టనీయలేదు. తవ్ర ఉద్రిక్త  పరిస్థితులు ఏర్పడటంతో ఇంకా పరిస్థితి ముదరకుండా ఆయన వెళ్లిపోయారు. చంద్రబాబు పుంగనూరులోకి రానివ్వకుండా చేయడానకే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.  పూర్తి వివరాలు

రాజకీయ నేతలతో చేతులు కలిపి సమిధలు కావొద్దు - పోలీసులకు చంద్రబాబు సూచన !తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్ర కొనసాగుతోంది.  రేణిగుంట వై కన్వెన్షన్ హాల్ లో సాగునీటి ప్రాజెక్టులపై యుద్దభేరి ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమను రాళ్ళ సీమగా చేశారని.. వైసీపి నాయకులు దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.  దౌర్జన్య కాండలో పోలీసులు సమిధలు కావొద్దని సూచించారు.  కొంత మంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి అపహాస్యం పాలు కావద్దని సూచించారు. తాను  ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే రాజకీయం చేశానని..  ఎక్కడా నాపై జరగని దాడి జిల్లాలో జరిగిందన్నారు.  పూర్తి వివరాలు

ఆర్టీసీ బిల్లులో అభ్యంతరాలు లేవనెత్తిన గవర్నర్ - వివరణ ఇచ్చిన ప్రభుత్వంఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళసై బిల్లును అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఐదు అంశాలపై వివరణ కావాలని గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు స్పందించిన సర్కారు.. రాజ్ భవన్ కు వివరణ ఇచ్చింది. ఈక్రమంలోనే రాజ్ భవన్ ప్రభుత్వం వివరణ కాపీని పంపింది. కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని పేర్కొంది. విలీనం అయిన తర్వాత రూపొందించే గైడ్ లైన్సులో అన్ని అంశాలు ఉంటాయని వివరించింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది.  పూర్తి వివరాలు

కార్మిక సంఘాలతో గవర్నర్ చర్చలు- సానుకూలంగా స్పందించారన్న నాయకులుఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వ వివరణ ఇంకా అందలేదని, అది అందిన వెంటనే ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై చెప్పినట్లు టీఎంయూ నేత థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంపై గవర్నర్‌ తమిళిసైతో టీఎంయూ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై గవర్నర్, టీఎంయూ నేతలు చర్చించారు. అనంతరం థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు విజయవంతంగా ముగిశాయన్నారు. బిల్లు ఆమోదించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. తమ సమస్యలను గవర్నర్ విన్నారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు.  పూర్తి వివరాలు

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం, బర్త్‌రఫ్‌ చేయండి- గవర్నర్‌కు టీడీపీ వినతిపుంగనూరు ఘటనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని తెలుగు దేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పుంగనూరు కేంద్రంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన యాత్రలో జరిగిన ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనకు కనీసం పోలీసులు భద్రతను కల్పంచటం లేదని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. విజయవాడలో రాజ్‌భవన్‌కు వెళ్లిన నాయకులు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు.  పూర్తి వివరాలు