Janaki Kalaganaledhu August 5th: జానకి తన అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక తన అన్నయ్య బాధపడుతూ వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత రామ జానకితో మీ అన్నయ్యను అన్న పంపించటం కరెక్టు కాదేమో అని బాధపడతాడు. కానీ జానకి మాత్రం చెల్లెలి మీద ప్రేమ ఉండాలి కానీ అటువంటి ప్రేమ ఉండకూడదు అని.. ప్రేమ ఉన్నవాళ్లు బయట సపరేట్ కాపురం పెట్టమని అన్నారు.


మా అన్నయ్య మాత్రం అలా ప్రవర్తించాడు. అంతేకాకుండా మిమ్మల్ని కూడా అవమానించాడు. ఆయన బదులు నేను క్షమాపణలు చెబుతున్నాను అని బాధపడుతుంది జానకి. దానికి రామ అలా ఏమి కాదు అని కానీ మీరు మీ అత్తింటి గురించి గొప్పగా చెప్పటం నాకు చాలా సంతోషంగా అనిపించిందని పొగుడుతాడు. ఆ తర్వాత రామ మీ అన్నయ్యని పిలిచి భోజనాన్ని చేయించి పంపిద్దాము అని అనటంతో జానకి వద్దు అని అంటుంది.


మరోవైపు జ్ఞానంబ జానకి అన్న అలా ప్రవర్తించినందుకు బాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాంతో గోవిందరాజులు తను తన చెల్లెలి మీద అలా ప్రేమ చూపించాడు అని తట్టుకోలేక అలా ప్రవర్తించాడు అని అంటాడు. కానీ జానకి మాత్రం తన అన్నయ్యని కూడా చూడకుండా తనని అందరి ముందు అవమానించి తిట్టేసింది అని.. మన ఇంటి గురించి కూడా గొప్పగా చెప్పింది కదా అనడంతో జ్ఞానంబ కూడా అవును అని అంటుంది.


ఇక చదువుకున్న కోడలైతే కొడుకుని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అనుకున్నావు కానీ జానకి చూశావు కదా ఎంత మంచి మనసు అని గోవిందరాజులు అంటాడు. దానికి జ్ఞానంబ కూడా అవును అని జానకి ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది అని..  కానీ నా తమ్ముడు జీవితంలో జరిగినట్లు జరుగుతుందని భయపడ్డాను తప్ప తనను అవమానించలేదు అని అంటుంది.


ఇక మల్లిక తన ప్లాన్ సక్సెస్ కాలేదు అని బాగా చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడే మలయాళం అక్కడికి వచ్చి తనకు బాగా మండుతుందని గమనించి కాసేపు వెటకారం చేస్తూ ఉంటాడు. దాంతో మల్లిక నీకు ఇక పెళ్లి కాదు అంటూ శాపం పెడుతుంది. మరోవైపు రామ జానకి దగ్గరికి వెళ్లి తనతో కాసేపు సరదాగా మాట్లాడి తనకు తన యూనిఫాంలో ఉన్న ఫోటోను బహుమతిగా ఇస్తాడు. అది చూసి జానకి ఫిదా అయ్యి ముద్దు పెడుతుంది.


నువ్వు కాదు ముద్దు పెట్టేది నేను పెట్టాలి అని రామ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ ఫోటోను టేబుల్ మీద పెట్టడంతో జానకి సంతోషపడుతుంది. ఇక మలయాళం బాగా ఆలోచిస్తూ ఉండగా జానకి అక్కడికి వస్తుంది. ఏం జరిగింది అని జానకి అడగటంతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ జానకికి వెన్నెల గుర్తుకురావడంతో వెంటనే వెన్నెల దగ్గరికి వెళ్తుంది.


అక్కడ లేకపోయే సరికి తన గదిలో వెన్నెల తన బాయ్ ఫ్రెండ్ ఫోటో బొమ్మ గీసి ఉంటుంది. ఇక వెన్నెల దగ్గరికి వెళ్ళగానే వెన్నెల ఫోన్ మాట్లాడుతుంది. వెంటనే వెన్నెల తన వదిన ను షాక్ అవుతుంది. ఫోన్లో ఎవరు అని అడగటంతో తన కోచింగ్ సెంటర్ ఫ్రెండ్ అని అబద్ధం చెబుతుంది. సరే బాగా చదువుకో అని చెప్పి జానకి కాస్త ముందుకు జరిగి వెళ్లగా వెన్నెల ఊపిరి పీల్చుకుంటుంది. దాంతో వెన్నెల వైపు సీరియస్ గా చూస్తుంది జానకి.


 


also read it : Prema Entha Madhuram August 4th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: చేయి కట్ చేసుకొని వర్ధన్ ఇంట్లో సెటిలైన మాన్సీ, బాధతో కుమిలిపోతున్న అంజలి?


 



Join Us on Telegram: https://t.me/abpdesamofficial