Prema Entha Madhuram August 4th: అను చేసిన ఫుడ్ ను గుర్తుపట్టి ఆర్య వెంటనే అది ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారో ప్రీతి వాళ్ళని అడగమని అంటాడు. దాంతో అంజలి ప్రీతికి ఫోన్ చేసి అడగటంతో వాళ్ళు షాక్ అవుతారు. ఇక ఆర్య ఫోన్ తీసుకొని అంజలిని అడుగుతాడు. అను చేసినట్లు ఉంది ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారో చెప్పండి అని అంటాడు. ప్రీతి ఏమి చెప్పలేక ఫోన్ అనుకి ఇస్తుంది.


ఇక అను తనకు తెలిసిన ఒక ముసలావిడ దగ్గర చేయించాను అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అను బాధపడుతుంది. చేసిన వంట కూడా గుర్తుపట్టాడు అని ప్రీతి, రేష్మ అంటారు. అను ఆర్య గుర్తును చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంజలి, నీరజ్ ఆఫీస్ కి వెళ్లి బయలుదేరుతుండగా అప్పుడే అక్కడికి మాన్సీ వస్తుంది.


ఇక శారదమ్మ కూడా అక్కడికి వచ్చి తనని చూసి షాక్ అవుతుంది. వెంటనే నీరజ్ మాన్సీ ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కోపంగా అరుస్తాడు. ఇక మాన్సీ మళ్ళీ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. నేను మారిపోయాను అని అంటుంది. కానీ శారదమ్మ మాత్రం తనపై కోపంగా అరుస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. వెంటనే మాన్సీ తను చేసిన తప్పులు అన్నీ ఒప్పుకొని మారిపోయాను అని అంటుంది.


కానీ ఇంట్లో వాళ్ళు క్షమించను అని అనటంతో..  వెంటనే అక్కడున్న చాకు తీసుకొని చేతి పై కట్ చేసుకుని తను మారిపోయాను నేనిక్కడే ఉంటాను అని అనటంతో శారదమ్మ కూడా సరే అంటుంది. ఇక అప్పటికే తను చెయ్యి కట్ చేసుకోవడంతో అది చూసి వాళ్ళందరూ షాక్ అయ్యి వెంటనే పట్టుకుంటారు. ఇక హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అనడంతో అంజలి వద్దు అని మనకే ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ ను ఇక్కడికే పిలిపిస్తాము అని అంటుంది.


ఆ తర్వాత శారదమ్మ వాళ్లంతా కూర్చొని జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ బాధపడతారు. ఇక మాన్సీ కి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తాడు. మరోవైపు శారదమ్మ వాళ్ళు ఆర్యకు ఏం చెప్పాలో అని భయపడతారు. అప్పుడే ఆర్య అక్కడికి వచ్చి ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అనటంతో ఏమీ లేదు అని అంజలి సరిదిద్దు చెబుతుంది. ఆర్య అక్కడినుంచి వెళ్లాక సమయం చూసుకొని సర్ కు నిజం చెబుతాను అని అంటుంది అంజలి.


ఆ తర్వాత అంజలి తన గదిలోకి వెళ్లి ఆలోచనలో పడుతుంది. అప్పుడే తన అంతరాత్మ తనతో మాట్లాడుతుంది. మాన్సీ అక్కడికి వచ్చినందుకు తనకు ఇంట్లో స్థానం ఎటువంటిదో అని ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు మాన్సీ ఇంట్లోకి రావటమే కాదు రేపు నీరజ్ పక్కన భార్యగా కూడా ఉంటుంది కదా అని అనుకుంటూ భయపడుతుంది.


ఇక ఆర్య దగ్గరికి వెళ్లి మాన్సీ గురించి మాట్లాడుతుంది. ఇక తన గురించి ఇప్పుడెందుకు అన్నట్లుగా ఆర్య అంటాడు. ఒకవేళ తను మారిపోయాను అని వస్తే తను ఎప్పుడు మారదు తను అవకాశం చూసుకుంటుంది తప్ప మారదు అని ఆర్య అంటాడు. తనను ఎప్పటికీ దూరంగా ఉంచాలి అని అంటాడు. దాంతో అంజలి కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తుంది.


also read it: Trinayani August 3rd: 'త్రినయని' సీరియల్: బిక్షం ఎత్తుకున్న తిలోత్తమా, వల్లభ - నయనిపై అనుమానం పడుతున్న విశాల్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial