Top 5 Telugu Headlines Today 30 October 2023: 


బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి - ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీ పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రచారంలో భాగంగా సూరంపల్లిలో ఓ ఫాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా కరచాలనం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎంపీకి తీవ్ర గాయాలు కాగా భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైసీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం లేదు- క్లారిటీ ఇచ్చిన మాజీ ఐపీఎస్‌ లక్ష్మినారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఏర్పాటు చేసుకుంటున్న పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని ఆహ్వానించడానికే వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ టైంలో అక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి తనను పిలిచారని వివరించారు. ఆ సమావేశంలో తాను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించనే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్ వ్యూహం - నిన్న నాగం, నేడు విష్ణువర్థన్ రెడ్డి, అసంతృప్తులే టార్గెట్ గా దూకుడు పెంచిన గులాబీ పార్టీ
తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో దూసుకెళ్తోంది. ఓ వైపు ముమ్మరంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఇతర పార్టీల అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునే దానిపై దృష్టి పెట్టారు. తద్వారా ఆ నేతల బ్యాక్ గ్రౌండ్, వారి రాజకీయ అనుభవం, ఆయా నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు తమకు ఎన్నికల్లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ, అసంతృప్తులపై దృష్టి సారిస్తూ వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పనే- వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు
నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడి రాజకీయ దుమారం రేపింది. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) గూండాలే డ్రైవర్‌, కండెక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి  చేశారంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆరోపించింది. టీడీపీ నేత నారా లోకేష్‌ కూడా వైఎస్‌ఆర్‌సీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే... ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది  ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందు  పెట్టారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం కారణం కాదని స్పష్టం చేశారు. విశాఖ - రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్ సిగ్నల్ గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని వెల్లడించారు. అయితే, ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టడమంటే రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని, అసలు ఆ రైలుకు సిగ్నల్ ఎవరిచ్చారనే నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి