Top 5 Telugu Headlines Today 24 October 2023: 


నిజం గెలిస్తే జీవితాంతం చంద్రబాబు లోపలే - భువనేశ్వరి, లోకేశ్‌ కూడా జైలుకే: రోజా
నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబు జైల్ లో ఉంటారని, ఆయనతో పాటుగా లోకేష్, భువనేశ్వరి కూడా జైల్ కి వెళ్ళే అవకాశం ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. మంగళవారం‌ ఉదయం స్వామి వారి నైవేద్యం విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె చంద్రబాబు, లోకేష్, నారా భువనేశ్వరి, పవన్ లపై తీవ్ర స్ధాయిలో‌ మండి పడ్డారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని గట్టిగా శ్రీ వేంకటేశ్వరస్వామి వద్ద పూజలు చేసినట్లు ఉన్నారని, మేము కూడా నిజం గెలవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ - నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసిన పురందేశ్వరి !
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల నిర్వహణ పైన, కార్పోరేషన్ల రుణాలపైన, ఆస్తుల తనఖ పెట్టి తెచ్చిన అప్పులు మరియు ఇతర సావరీన్ గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి  పైన ఫోరన్సిక్ ఆడిట్ జరిపించాలని ,  రాష్ట్ర ఆర్థిక స్థితి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుతూ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లేఖ ఇచ్చారు విజయవాడ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ ను పురందేశ్వరి కలిశారు. కీలక అంశాలతో కూడిన లేఖను ఇచ్చారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


సీఎం కేసీఆర్‌పై షబ్బీర్ అలీ పోటీకి దిగుతారా? - క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత
కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ. మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు.  తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనన్నారు. అధికార పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇద్దరు ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కేసీఆర్ అధర్మ యుద్ధం చేస్తున్నారన్న షబ్బీర్ అలీ, నా నిజాయితీ నిరూపించుకుంటానన్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ వైదొలిగిందా ? - నిజమేంటో చెప్పిన కాసాని జ్ఞానేశ్వర్ !
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిదని సోషల్ మీడియాలో ఒక్క సారిగా ప్రచారం ప్రారంభమయింది. మంగళవారం ఉదయం నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు.  తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం
ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలోని ఓ భాగం అయిన మేడిగడ్డ బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. ఆ బ్యారేజీ మధ్యలో ఓ పిల్లర్ కుంగిన సంగతి తెలిసిందే. దీంతో ఆరుగురు ఇంజీనిరింగ్ నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో మొత్తం ఆరుగురు సభ్యులు మంగళవారం (అక్టోబరు 24) మేడిగడ్డ బ్యారేజీను పరిశీలించారు. బ్యారేజీలోని 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను వారు పరిశీలించారు. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్‌ పటుత్వం, జరిగిన నష్టంపై జల సంఘం కమిటీ అంచనా వేసి, సమగ్ర పరిశీలన చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


తిరుమల శ్రీవారి సన్నిధిలో భువనేశ్వరి, రేపటి నుంచి బస్సు యాత్ర షురూ
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత ‌నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేసిన ఆమెకు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి