Top 5 Telugu Headlines Today 21 October 2023:
కంటతడి పెట్టిన నారా లోకేశ్ - ప్రజల కోసమే చంద్రబాబు నిరంతర పోరాటం అంటూ భావోద్వేగం
టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతర పోరాటమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ నేతలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని, సేవా కార్యక్రమాలు తప్ప, రాజకీయాలు తన తల్లికి తెలియవని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు
ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేసి కాదు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి - సీఎం జగన్‌కు శైలనాథ్ సలహా !
రాజకీయంగా ఎదగాలంటే ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని సీఎం జగన్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ సలహా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు ఇంతగా దిగజారడం బాధాకరమన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు
పోలీసులపైనా దాడులు చేశారు-ప్రతిపక్ష నేతపై సీఎం జగన్ ఫైర్
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. విధి నిర్వహరణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే యోధుడు పోలీస్ అంటూ కొనియాడారు ముఖ్యమంత్రి. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనిరతి అని.. ఆ డ్రెస్‌పై ఉన్న మూడు సింహాలు మనదేశ సార్వభౌమ అధికారానికి చిహ్నమని అన్నారు. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు.. ఒక బాధ్యత.. ఒక సవాల్ అన్నారు సీఎం జగన్. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలు
'తొలి విడతలో బీసీలకు 20కు పైగా సీట్లు' - బీజేపీ జాబితాపై ఎంపీ లక్ష్మణ్ స్పష్టత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని, తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశామని వివరించారు. 'ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశాం. తొలి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నాం. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది.' అని లక్ష్మణ్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు
రేపు సద్దుల బతుకమ్మ-ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బతుకమ్మ సంబరాలు... తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలై 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత. చివరిరోజు సద్దుల బతుకమ్మ చేసుకుంటారు. ఆ రోజు సందడి అంతా కాదు. మహిళలు 9రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను తీసుకుని... మంగళసూత్రానికి పెట్టుకుంటారు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడతారు. పూర్తి వివరాలు