AndhaNews :  రాజకీయంగా ఎదగాలంటే ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని సీఎం జగన్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ సలహా ఇచ్చారు.  మాజీ ముఖ్యమంత్రిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.  రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు ఇంతగా దిగజారడం  బాధాకరమన్నారు.  చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉందన్నారు.  చంద్రబాబు అరెస్ట్ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరని స్పష్టం చేశారు.  కేంద్రం కనుసన్నల్లోనే  ఇవన్నీ జరుగుతున్నాయేమో అని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.  చంద్రబాబును ఈ వయసులో ఇబ్బంది పెట్టడం  మంచిది కాదని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో చూసుకోవాలన్నారు.  


నీటి కొరత వల్ల ఎండిపోతున్న పంటల్ని పరిశీలిస్తున్న శైలజానాథ్ 


వర్షాభావం, కృష్ణా నీరు లేకపోవడం కారణంగా అనంతపురం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎండిపోతున్న పొలాల్ని శైలజానాథ్ పరిశీలిస్తున్నారు.  బయన్నపేట గ్రామ పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించారు.  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని..  ప్రభుత్వానికి రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాల పై ఉన్న శ్రద్ధ ఇతర సమస్యలపై లేదన్నారు.  రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు.  కనీసం ఇన్సూరెన్స్ లు కూడా అందించలేని దయనీయ ప్రశ్న ఈ రాష్ట్రం ఉంన్నారు.  అనవసరమైన బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప రైతాంగంపై దృష్టి సాధించలేకపోతున్నారని విమర్శించారు.  ప్రభుత్యం ప్రతి ఎకరాకు కనీసం 50,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 


ఎకరానికి రూ. యాభై వేలు పరిహారం డిమాండ్         
 
మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు హెచ్చెల్సీ ద్వారా నీటిని వదలాలని మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రంగమనాయునిపల్లిలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరువుల్లో నీరు లేకపోతే బోర్లు రీచార్జ్‌ కావన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  


సీమకు నీటి గండం                                  


అప్పర్ పెన్నర్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్నారు.  హార్టికల్చర్ లో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం జిళ్లా ఇవాళ రైతులు భయపడుతున్నారని..  భూగర్భజలాలు అగుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నేతలకు  ఇసుక, మట్టిపై ఉన్న మమకారం మరేదానిపై లేదన్నారు.  కాలువలకు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా నాయకులు రాజకీయాలు పెక్కన పెట్టి సాగు తాగునీటికోసం పోరాడాలని..  విద్యుత్ మోటర్లకు 2 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్  పోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్సహ పడుతున్నారు.. ఎందుకో అర్థం కావడం లేదన్నారు.