Posani Krishna Murali New Movie : ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి తెలుగులో స్టార్ రైటర్! ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్! అయితే... కొంత కాలంగా తెలుగు తెరపై ఆయన సందడి కాస్త తగ్గింది. రాజకీయ తెరపై ఎక్కువ పోసాని కనపడుతున్నారు. ఇప్పుడు ఓ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మీద ఆయన ఫేస్ కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' (Anukunnavanni Jaragavu Konni). ఈ చిత్రాన్ని శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. జి. సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 'అల్లరి' నరేష్ చేతుల మీదుగా విడుదల అయ్యింది.
'సిల్లీ ఫెలోస్'కి సహాయ దర్శకుడిగా పని చేశారు - 'అల్లరి' నరేష్
'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత 'అల్లరి' నరేష్ మాట్లాడుతూ... ''ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన 'సిల్లీ ఫెలోస్’ చిత్రానికి జి సందీప్ సహాయ దర్శకుడిగా పని చేశారు. ఇప్పుడీ సినిమాతో అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా హిట్ అయ్యి నిర్మాతకు డబ్బులు, హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు అందరికీ మంచి పేరు తీసుకు రావాలి. దర్శకుడిగా సందీప్ బిజీ కావాలి'' అని అన్నారు.
Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?
కామెడీ థ్రిల్లర్ చిత్రమిది - హీరో శ్రీరామ్ నిమ్మల
'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' సినిమా కామెడీ థ్రిల్లర్ అని హీరో శ్రీరామ్ నిమ్మల చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నరేష్ గారు క్రైమ్, కామెడీ జానర్ సినిమాలు ఎన్నో చేశారు. ఈ టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది. ఆల్రెడీ సినిమా రషెస్ చూశాం. మేం చాలా హ్యాపీ. బాగా వచ్చింది. నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ ''క్రైమ్ కామెడీ నేపథ్యంలో తీసిన చిత్రమిది. దర్శకుడిగా నాకు మొదటిది. ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించారు. నవంబర్ 3న తప్పకుండా థియేటర్లలో చూడండి. మా సినిమా పోస్టర్ విడుదల చేసిన నరేష్ గారికి థ్యాంక్స్’’ అని అన్నారు.
Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?
'అనుకున్నవన్ని జరగవు కొన్ని' సినిమాలో శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, 'భమ్ చిక్' బబ్లూ, కిరీటి, 'మిర్చి' హేమంత్, గౌతమ్ రాజు, లోహిత్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : చిన్నా రామ్ & జివి అజయ్, కూర్పు : కె.సి.బి హరి, సంగీతం : గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బీవీ నవీన్, కథ - దర్శకత్వం : జి. సందీప్, నిర్మాణం : శ్రీ భరత్ ఆర్ట్స్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial