Top 5 Telugu Headlines Today 14 November 2023: 


టీడీపీ, లోకేష్‌తో ఏ పంచాయతీ లేదంటున్న కేటీఆర్ - సీమాంధ్ర మూలాలున్న ఓటర్ల అసంతృప్తిని గుర్తించారా ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటోంది. క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు వ్యతిరేకంగా మారుతున్నాయి అనుకున్న వర్గాల్ని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అడుగు ముందుకు వేశారు. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న సీమంధ్ర మూలాలున్న ఓటర్లు బీఆర్ఎస్‌కు దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ ఇటీవలి కాలంలో ఈ ఆంశంపైనే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. టీవీ చానళ్లకు ఇస్తున్న ఇంటర్యూల్లో తాను అలా అనకుండా ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే- తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్
మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే తన ఆలోచన అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయాన్ని ఉంచుకోనన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వచ్చే ఎన్నికలను లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్న జేసీ కుటుంబం - గెలిచేందుకు ఏం చేస్తున్నారంటే ?
ఉమ్మడి అనంతపురం జిల్లా  తాడిపత్రి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది జెసి బ్రదర్స్. తాడిపత్రి నియోజకవర్గం లో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం జేసీ కుటుంబానిదే అవుతుంది.  అటువంటిది 2019 ఎన్నికల్లో  ఆ కుటుంబం ఓడిపోయింది.  తాడిపత్రి అసెంబ్లీలో  వైయస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో జేసీ  ప్రభాకర్ కుమారుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు.  ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో  జేసీ కుటుంబం తాడిపత్రిలో  కోల్పోయిన పట్టును సాధించాలని ఎంతో పట్టుదలగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీ ఫిర్యాదులు-తెలంగాణ సీఈవో రియాక్షన్‌ ఏంటంటే?
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS)‌, కాంగ్రెస్‌(Congress) మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు... ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పర ఫిర్యాదులతో తెలంగాణ ఎన్నికల సంఘం (Election Commission of Telangana) తల బొప్పికడుతోంది. నిన్న... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన ఇరు పార్టీలు.. ఒకరిపై మరొకరు పోటాపోటీగా కంప్లెయింట్స్‌ చేశారు. ముందుగా... తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ కలిసింది. కాంగ్రెస్‌ ఇస్తున్న ఎన్నికల ప్రచార ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేసింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి  


పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు-ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలన్న లోకేష్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ (Arogyashri) బకాయిలపై పొలిటికల్‌ ఫైట్‌ మొదలైంది. బకాయిలు చెల్లించకపోతే ఈనెల 27 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) రియాక్ట్‌ అయ్యారు. పేదల ఆరోగ్యం, ప్రాణాలు చెలగాటం వద్దని... వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని వైఆర్‌ఎస్‌సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Government) డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి