ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధాం తీసుకొస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. పూర్తి వివరాలు


బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే  నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు. ఆ పార్టీలో ఉన్న వారిని ఎలా బయటకు లాగుదామా అని ఆలోచిస్తున్నారట.  పూర్తి వివరాలు  


చంద్రబాబుపై మారుతున్న ఏపీ బీజేపీ నేతల స్వరం - సోము, విష్ణువర్ధన్ రెడ్డి ఏం అంటున్నారంటే ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి అమిత్ షా , జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ పొత్తులపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉండవని బండి సంజయ్ చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు  వెళ్లి అమిత్ షాను కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దాదాపుగా అదే చెబుతున్నారు. అయితే పొత్తులు ఉండవని నేరుగా ప్రకటించడం లేదు. గతంలోలా టీడీపీపై ఘాటు విమర్శలు చేయలేదు.  పూర్తి వివరాలు  


ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ లభించింది. తన భార్య ఆరోగ్యం బాగో లేదని ఆమెను చూసుకోవాలని పిటిషన్ దాఖలు చేయడంతో  రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  రెండు వారాల పాటు బెయిల్ అమల్లో ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక నిందితుడు ్యిన శరత్ చంద్రారెడ్డి కూడా తన భార్యకు అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. తర్వాత అప్రూవర్ గా మారారు.  పూర్తి వివరాలు  


ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్ లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కలాశాలకు చేరుకున్న కేటీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ బవన సముదాయానికి దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సంఘం, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే ఇటీవలే నిర్మించిన 5 మోడల్ పోలీస్ స్టేషన్లను(ములుగు, పేరూరు, వాజేడు, మేడారం, కన్నాయిగూడెం) నేడు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాన చేశారు.  పూర్తి వివరాలు