AP Cabinet Decisions: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధాం తీసుకొస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 



ఉదయం 11 గంటలకు సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ బటన్‌ నొక్కి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని డిసైడ్ చేశారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగించేందుకు కూడా ఓకే చెప్పారు. దీని కోసం రూ. 6,888 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బిల్లుకు ఓకే చెప్పింది కేబినెట్. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకు వచ్చేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


 


కొత్త మెడికల్ కాలేజీల కోసం 706 పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ అంగీకరించింది. ఏపీ పౌరసరఫరాల సంస్థకు రూ.5000 కోట్ల రుణం తీసుకునేందుకు ఓకే చెప్పింది. జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు.  ఇటీవల పదో తరగతి పరీక్షల్లో పాసైన వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిచిన వారికి జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేయనున్నారు.