టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై నెల్లూరులో దాడి జరిగింది. నెల్లూరు బీబీనగర్ సమీపంలో టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు నివాసం వద్ద ఆనం వెంకట రమణారెడ్డి ఉండగా 8 మంది దుండగులు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆనంపై దాడి చేస్తున్న వారిని అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు రెండు వాహనాలను అక్కడే వదిలి పారిపోయారు. కర్రలు, మారణాయుధాలతో సహా దుండగులు అపార్ట్ మెంట్ దగ్గరకు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. అపార్ట్ మెంట్ వాసులంతా కేకలు వేయడంతో దాడి చేయడానికి వచ్చినవారు పారిపోయారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి  


రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
ఒడిశా రాష్ట్రంలోని బహనగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆదివారం (జూన్ 4) ఉదయం ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో దెబ్బతిన్న మూడు ట్రాక్ ల పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుంది అని అధికారులను ప్రశ్నించగా, ఆదివారం సాయంత్రానికి ఒక ట్రాక్ అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఘటనా స్థలంలో ట్రాక్ మరమ్మతు తదితర కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి, అధికారులకు స్థానికులు అందిస్తున్న సహకారాన్ని చూసిన మంత్రి అమర్నాథ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి  


కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు
ఒడిశా రైలు దుర్ఘటన గురించి ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం సమీక్ష చేస్తున్నారని, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వర్రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులకు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
భాగ్య నగర వాసుల బాధల్ని తీరుస్తూ, లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్ ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతుంది. అయితే ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలవువు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ వద్దకు వస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు మెట్రో సర్వీస్ పొడగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫీర్జాదిగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
మీడియేషన్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది అని.. కానీ వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ విఫలం అవుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో ఈఎండబ్ల్యూ మీడియేటర్స్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే తమిళిసై మాట్లాడుతూ.. మీడియేష్న అనే ఒక మెడిటేషన్ లాంటిది అని చెప్పారు. వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ సఫలం కావడం లేదని అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి