Governor Tamilisai: మీడియేషన్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది అని.. కానీ వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ విఫలం అవుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేట మ్యారిగోల్డ్ హోటల్ లో ఈఎండబ్ల్యూ మీడియేటర్స్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కలిసి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే తమిళిసై మాట్లాడుతూ.. మీడియేష్న అనే ఒక మెడిటేషన్ లాంటిది అని చెప్పారు. వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ సఫలం కావడం లేదని అన్నారు. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కేసుల పరిష్కారం అనంతరం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తనకు మీడియేషన్ లో ఎంతో అనుభవం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు మీడియేషన్ ద్వారా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
ABP Desam
Updated at:
04 Jun 2023 03:27 PM (IST)
Edited By: jyothi
Governor Tamilisai: మీడియేషన్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. కానీ వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ విఫలమవుతోందన్నారు.
మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు"