తెలంగాణలో జూన్ 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జూన్ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో  హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో జారీ చేసిన హాల్‌టికెట్లు చెల్లవని కమిషన్ ఇప్పటికే స్పష్టంచేసింది.


తెలంగాణలో 503 పోస్టులతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది.


పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా హాల్‌టికెట్లను జూన్ 4న విడుదల చేయనున్నారు.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 


నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నియామక నిబంధనల ప్రకారం పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా పరీక్ష కేంద్రాలను పేర్కొంటూ హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కమిషన్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇది మరో రెండు రోజుల్లో ముగియనుంది. గ్రూప్-1 హాల్‌టికెట్లు జూన్ 3 లేదా 4న అందుబాటులోకి రానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు.


నిబంధనలను అతిక్రమిస్తే డీబారే..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో సంబంధాలున్న 50 మందిని రెండు రోజుల వ్యవధిలో కమిషన్ డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా..



Also Read:


గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు మొదలుపెట్టిన టీఎస్‌పీఎస్సీ, OMR విధానంలోనే పరీక్ష!
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టయింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
ఏపీలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 57 నోటిఫికేషన్ల విడుదల చేసిందని, వీటి ద్వారా 5,447 పోస్టులను భర్తీ చేసిందని సవాంగ్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...