Interest Rates: మరికొన్ని రోజుల్లో RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్ ఉంది. దీనికి ముందు, కొన్ని బ్యాంక్‌లు లోన్లు & డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచాయి/తగ్గించాయి. MPC మీటింగ్‌కు ముందు వడ్డీ రేట్లను రివైజ్‌ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియే.


ఇండియన్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు
ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank), తన MCLRను ‌(Marginal Cost of Funds based Lending Rate) 0.05% లేదా 5 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో, ఒక నెల MCLR ప్రస్తుతమున్న 8.10 శాతం నుంచి 8.15 శాతానికి చేరింది. 3 నెలల వడ్డీ రేటు 8.20 శాతం నుంచి 8.25 శాతానికి ఆరు నెలల MCLR 8.45 శాతం నుంచి 8.50 శాతానికి, ఏడాది కాల వ్యవధి రుణాలపై MCLR 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. కొత్త రేట్లు ఈ నెల నిన్నటి (శనివారం, 03 జూన్‌ 2023) నుంచి అమల్లోకి వచ్చాయి.


యెస్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు
యెస్‌ బ్యాంక్‌ (Yes Bank) కూడా తన సైతం MCLRను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త రేట్ల ప్రకారం, నెల కాల వ్యవధితో ఇచ్చే రుణలపై వడ్డీ రేటు 8.80 శాతానికి, 3 నెలల MCLR 9.45 శాతానికి, 6 నెలల రుణాలపై 9.75 శాతానికి, ఏడాది కాల వ్యవధి లోన్లపై MCLR 10.05 శాతానికి చేరింది. 


ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) మాత్రం లోన్‌ రేట్లు తగ్గించింది. ఇప్పుడు, ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లు హౌసింగ్‌ లోన్‌ సహా చాలా లోన్లను తక్కువ వడ్డీకే పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, తన ఓవర్‌నైట్‌ (ఒక రోజు రుణం) MCLRను 8.35 శాతానికి కుదించింది. ఒక నెల కాల పరిమితి లోన్లపై MCLRను 8.50 శాతం నుంచి 8.35 శాతానికి, 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. మూడు నెలల కాలానికి MCLR 8.55 శాతం నుంచి 8.40 శాతానికి 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆరు నెలలు కాల వ్యవధి రుణాలపై 8.75 శాతానికి, ఒక సంవత్సరం కాల వ్యవధి రుణాలపై 8.85 శాతానికి తగ్గించింది. ఈ రేట్లన్నీ 2023 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 


RBL బ్యాంక్‌ ACE FD స్కీమ్‌
పెద్ద అమౌంట్‌ను FD చేయాలనుకునేవాళ్ల కోసం ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ప్రత్యేకంగా ‘ఏస్‌’ పేరిట ఫిక్స్‌డ్‌ పాజిజిట్‌ స్కీమ్‌ ప్రారంభించింది. ఇందులో, కనీసం రూ. 50 లక్షల నుంచి గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. 12 నెలల నుంచి 240 నెలల మధ్య, వివిధ కాల వ్యవధులకు వివిధ వడ్డీ రేట్లను బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. సాధారణ డిపాజిటర్లకు (60 ఏళ్ల వయస్సు లోపు వ్యక్తులు) 12-15 నెలలకు 7.20 శాతం, 453 రోజుల నుంచి 24 నెలల వరకు 8 శాతం, 24-36 నెలల కాలానికి 7.70 శాతం, 36-60 నెలల కాలానికి 7.30 శాతం, 60-240 నెలల కాలానికి 7.20 శాతం చొప్పున వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది. సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్‌ సిటిజన్లకు 0.50% లైదా 50 bps; సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 0.75% లేదా 75 bps ఎక్కువ వడ్డీ అందుతుంది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి