AP Telangana News Today: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?
తెలంగాణ ఎన్నికలు మగిశాయి. పదేళ్ల తర్వాత కారు జోరుకు తెలంగాణ ప్రజలు బ్రేకు వేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా  బీఆర్ఎస్ పదేళ్లపాటు హవా చూపించగా... ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి ప్రజలు పట్టం కట్టారు. ఇక తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా  రేవంత్ రెడ్డి ఉండగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికార పీఠం దక్కించుకోగా, బీఆర్ఎస్  39 సీట్లకు పరిమితమై ప్రతిపక్షహోదా దక్కించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎల్పీ లీడర్ ఎంపిక బాధ్యత అధిష్ఠానానికే, కాసేపట్లో సీఎం పేరుపై ప్రకటన వచ్చే ఛాన్స్!
హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను మాత్రం ఏఐసీసీకే అప్పగిస్తున్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం పెట్టారు. దీన్ని భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు బలపరిచారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక ఏఐసీసీకి అప్పగించారు. అధిష్ఠానం నిర్ణయం ఏదైనా శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్ఠానానికి పంపారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కూడా తీర్మానం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
 
సాయంత్రం తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం- చాలా సింపుల్‌గా కార్యక్రమం!
తెలంగాణ(Telanagana) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections 2023) ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress)పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేసం జరుగుతోంది. అక్కడ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో చాలా మంది సీఎం అభ్యర్థులం అంటూ గతంలో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీనిపై పెద్ద వివాదం నెలకొంటుందని అంతా భావించారు. అయితే ఆలాంటి సమస్య లేకుండా సీఎం అభ్యర్థి ఎంపికను స్మూత్‌గా డీల్ చేయాలని అధినాయకత్వం భావిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. ఇన్నిరోజులు వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు సైక్లోన్ ధాటికి బయపడిపోతున్నారు. వారిలో భయాన్ని పొగొట్టి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుపాను రాక అనంతర పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు జిల్లా యంత్రాంగం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని శిబిరాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి లోటు రానీయొద్దని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రిలో టిడ్కో ఇళ్ళ వద్దకు లబ్ధిదారులతో కలిసి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. నా ఇల్లు నా సొంతం అనే ప్రజా ఉద్యమం ద్వారా టిడ్కో ఇళ్ల వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. పట్టణంలో ర్యాలీగా వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ సమీపంలో పోలిసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి