Top 5 Telugu Headlines Today 02 October 2023:
ఢిల్లీలో లోకేష్, జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో భువనేశ్వరి నిరాహార దీక్ష, సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిరశన
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ జయంతి రోజున సత్యమేవజయతే పేరుతో దీక్షలకు కూర్చున్నారు. సాయంత్రం వరకు జరిగే దీక్షల్లో అగ్రనేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు, బయట నారా భువనేశ్వరిలు చేపట్టిన దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు. పూర్తి వివరాలు
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు, లోకేష్‌తో కలిపి విచారణ చేసే అవకాశం
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు సీఐడీ నోటీసులు పంపింది. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. పూర్తి వివరాలు
పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మార్చేశారా ? బీజేపీని సైడ్ చేసేసినట్లేనా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యాక ఖండించిన జనసేనాని, ఆ తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామంటూ...బంతిని కమలం కోర్టులోనే వేసేశారు. దీంతో అప్పటి వరకు జనాలకు ఉన్న అనుమానాలు పటా పంచలయ్యాయి. పవన్ కల్యాణ్ కామెంట్స్ తో ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ఎప్పటిలాగే వైసీపీ తన పాత పల్లవి అందుకుంది. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసింది. పూర్తి వివరాలు
బెంగళూరు కంటే ఎక్కువగా హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు- మలక్ పేటలో ఐటీ టవర్‌కు కేటీఆర్ భూమిపూజ !
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు సోమవారం ఉదయం ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఐటి పార్కు భవన నమూనాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పది ఎకరాల విస్తీర్ణంలో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో భారీస్థాయిలో ఐటీ టవర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 50 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుంది. పూర్తి వివరాలు
ఢిల్లీలో అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ - తెలంగాణ బీజేపీలో ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు ?
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అర్జంట్‌గా ఢిల్లీ రావాలని హైకమాండ్ ఆదేశించడంతో మంగళవారం నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉన్నా వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, మోదీ సభపై అమిత్ షాతో చర్చించారు. పూర్తి వివరాలు