Top 5 Telugu Headlines Today 01 October 2023: 

మొండి చెయ్యి పార్టీ, చెవిలో పువ్వు పార్టీని నమ్మకండి - కేటీఆర్ వ్యాఖ్యలుకాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు, కష్టాలు అని.. బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు.. సంక్షేమం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు కేసీఆర్‌ కావాలా? రాబంధు కాంగ్రెస్‌ కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పూర్తి వివరాలు

శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తిమహబూబ్ నగర్ జిల్లా పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రధానికి స్వాగతం పలికారు. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. పూర్తి వివరాలు

దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలుటీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు నిధులిచ్చారంటూ తప్పుడు లెక్కలు చూపించారని, ఆ తప్పుడు లెక్కలతో డబ్బులన్నీ చంద్రబాబు అకౌంట్ కి వెళ్లాయని, అందుకే ఇప్పుడాయన జైలులో ఊచలు లెక్కబెడుతున్నారని అన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో కూడా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల పేరుతో పెద్ద అవినీతి జరిగిందన్నారు. స్కిల్ సెంటర్లకు టీడీపీ నేతలు వెళ్లి హడావిడి చేయాలని చూసినా ఫలితం లేదన్నారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కాలేజీలను, విక్రమ సింహపురి యూనివర్శిటీని టీడీపీ నేతలు సందర్శించారు.  పూర్తి వివరాలు

తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను 4వ తేదీన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడంలేదని, ఛార్జిషీటు సరిగ్గా దాఖలు చేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు

టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?ఎన్నికలు సమీపించిన తరుణంలో చిత్రసీమ ప్రముఖులు కొందరు ఏదో ఒక పార్టీకి మద్దతు పలకడం సహజంగా జరుగుతుంది. మూకుమ్మడిగా చిత్ర పరిశ్రమ అంతా కలిసి ఒక్క పార్టీకి మద్దతు పలకడం ఎప్పుడూ జరగలేదు. అలా జరగదు కూడా! అయితే... మెజారిటీ లెక్కలు చూసుకుంటే? రాబోయే ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party), జనసేన పార్టీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మద్దతు లభించేలా కనపడుతోంది. అది సినిమాల్లో కావచ్చు... నేరుగా కావచ్చు! పూర్తి వివరాలు