2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను 4వ తేదీన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడంలేదని, ఛార్జిషీటు సరిగ్గా దాఖలు చేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.