గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ 'గణేష్ యాంథమ్' విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించారు. 


అక్టోబర్ 4న 'ఉయ్యాలో ఉయ్యాల' విడుదల
'A song that defines the bond of Bhagavanth Kesari' అంటూ 'భగవంత్ కేసరి' చిత్ర బృందం ఈ రోజు ఓ స్టిల్ విడుదల చేసింది. 'ఉయ్యాలో ఉయ్యాల' పాటను (Uyyaalo Uyyaala Song) అక్టోబర్ 4న (బుధవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. సినిమాలో తండ్రి బిడ్డ మధ్య బంధం తెలిపే విధంగా, సినిమాలో కోర్ పాయింట్ చెప్పే విధంగా ఈ సాంగ్ ఉంటుందని సమాచారం. 


Also Read : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?






సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ!
ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందట. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఓ లెక్క... ఇప్పుడీ 'భగవంత్ కేసరి'ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందట! కామెడీ కంటే కంటెంట్ ఎక్కువ హైలైట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. 


Also Read బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?


ఇటీవల 'భగవంత్ కేసరి' మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివరలో 'బ్రో... ఐ డోంట్ కేర్' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ''కలిసి మాట్లాడతా అన్నా కదా! అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే?!'' అంటూ అయన గూండాలను హెచ్చరించారు. ఎనిమిది నెలల్లో, 24 అద్భుతమైన ప్రదేశాలలో, 12 మాసివ్ సెట్లలో చిత్రీకరణ పూర్తి చేశారు.



'భగవంత్ కేసరి' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial