చైనాలోని హాంగ్‌ఝూలో జరుగుతున్న 19వ ఏసియన్ గేమ్స్‌లో భారత్ మొత్తం 41 పతకాలు గెల్చుకుంది. వీటిలో 11 స్వర్ణాలు, 15 రజతాలు, 14 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. షూటర్ల భారత జట్టు ఇప్పటివరకు 21 పతకాలు సాధించింది. కేవలం షూటర్లే వేర్వేరు ఈవెంట్లలో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్యాలు సాధించారు. మహిళల క్రికెట్, ఈక్వెస్ట్రియన్, స్క్వాష్, టెన్నిస్‌లలో భారత్‌కు మిగిలిన నాలుగు స్వర్ణాలు వచ్చాయి. షూటింగ్ తర్వాత, రోయింగ్ భారత్‌కు ఇప్పటివరకు అత్యధిక పతకాలను అందించింది. రెండు ఈవెంట్‌లు కాకుండా, సెయిలింగ్, అథ్లెటిక్స్‌లో భారత్ మూడు పతకాలు, ఈక్వెస్ట్రియన్, స్క్వాష్, టెన్నిస్‌లలో రెండు పతకాలను గెలుచుకుంది. గోల్ఫ్, క్రికెట్, ఉషు ఇప్పటి వరకు ఒక్కో పతకం వచ్చింది.


ఇప్పటి వరకు భారత్ బంగారు పతకం సాధించిన ఈవెంట్స్
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ మెన్, 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ మెన్, 10 మీ ఎయిర్ పిస్టల్ ఉమెన్, 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఉమెన్, 25 మీ పిస్టల్ టీమ్ వుమెన్, ఉమెన్స్ డ్రెస్ క్రికెట్, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, స్క్వాష్ మెన్స్ టీమ్ మరియు ట్రాప్ టీమ్ మెన్ విభాగాల్లో స్వర్ణాలు దక్కాయి.


పిస్టల్ షూటర్ ఈషా సింగ్ నాలుగు పతకాలను - ఒక స్వర్ణం, మూడు రజతాలను కైవసం చేసుకుంది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ కూడా మొత్తం నాలుగు పతకాలు - రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెల్చుకుంది. రైఫిల్ షూటర్ ఆషి చౌక్సే మూడు పతకాలు - రెండు రజతం, ఒక కాంస్యం సాధించింది. 


భారత్‌కు రెండు పతకాలు సాధించిన ఇతరులు
పాలక్ గులియా (స్వర్ణం, రజతం), సిఫ్ట్ కౌర్ సమ్రా (స్వర్ణం, రజతం), అనూష్ అగర్వాలా (స్వర్ణం, కాంస్యం), ఆశిష్ (రజతం, కాంస్యం), పునీత్ కుమార్ (రజతం, కాంస్యం), అనంత్ జీత్ సింగ్ నరుకా (రజతం, కాంస్యం), రమితా జిందాల్ (వెండి, కాంస్య), భీమ్ సింగ్ (రజతం, కాంస్య), జస్విందర్ సింగ్ (వెండి, కాంస్య) పతకాలు గెల్చుకున్నారు.