నేడు బోయిన్ పల్లిలో కాంగ్రెస్ శిక్షణ తరగతులు


నేడు బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు నేడు జరిగే మీటింగ్ కు వెళ్లాలా ? వద్దా ? అనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని... బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లెవరూ అటెండ్ కాలేదు.


నేటి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారంటే...


బోయినిపల్లి లోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, మరియ సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన, శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్ నాయకులు, జోడో అభియాన్ జాతీయ సమన్వయ కర్త గిరీష్ ఛాడొంకర్ తదితరులు పాల్గొంటారు. 


రేవంత్ రెడ్డి పాదయాత్ర పై నేడు క్లారిటీ.. షెడ్యూల్ విడుదల చేసే అవకాశం


రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ యాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా.. లేదా? రాహుల్ పాదయాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో పేరుతో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనుంది. ఏఐసీసీ నుంచి కీలక నేత హాజరుకాబోతున్నారు. రేవంత్ రెడ్డి యాత్రతో పాటు సోషల్ మీడియా, ఎన్నికల కమిషన్, ధరణి పోర్టల్ సహా పలు అంశాలపై చర్చ జరగనుంది.


ఈ నెల 26 న భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఎలాంటి సమాచారం లేదని.. అంతే కాకుండా ఇవాళ జరిగే మీటింగ్‌కు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.


ఇదే క్రమంలో పీసీసీ పదవుల మధ్య ఈ మధ్య కాలంలో పెద్ద లొల్లి నడిచంది. దిగ్విజయ్ సింగ్ వచ్చి.. నేతల అభిప్రాయాలైతే తీసుకున్నారు.. కానీ దానికి సంబంధించి పార్టీలో ఎలాంటి నిర్ణయాలు మార్పులు జరగలేదు. ఇలాంటి టైమ్‌లో పీసీసీతో కలిసి నడిచేదెవరు? పట్టించుకోకుండా పక్కకు పోయేవారో? చూడాలి మరి.


నేడు హన్మకొండ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన


రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ, డిసిసిబి బ్యాంకు దగ్గర డిసిసిబి బ్యాంక్ డైరీ ఆవిష్కరణ చేస్తారు.అనంతరం 11 గంటలకు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం, దేవాదుల ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ, విష్ణు ప్రియ గార్డెన్స్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ చేయనున్నారు.


నేడు ఛలో ములుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి----రామప్ప పరిరక్షణ కమిటీ..


పర్యావరణ,ప్రకృతి,శిల్పకళా ప్రేమికులారా ఏకం కండి అని పిలుపు 


వరంగల్:  ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన అత్యద్భుత శిల్ప కళాఖండం అయిన "మన రామప్పకు "సింగరేణి కంపెనీ ఓపెన్ కాస్టు మైనింగ్ పేరిట ముప్పు తలపెట్టబోతున్నది. ఇప్పటికే ఈ సింగరేణి కంపెనీ తెలంగాణలో అడవులు,కొండలు,వాగులు,వంకలు,పంటపొలాలు, వందలాది పల్లెల ఆనవాళ్ళు లేకుండా చేసి జనం ,జంతు జాలం  పక్షి  జాతిని ఆగంబట్టిచ్చి బొందల గడ్డలుగా మార్చిన చరిత్ర ఈ సింగరేణికున్నది మనకు తెలిసిందే. వాస్తవంగా ఓపెన్ కాస్టు  మైనింగ్ అనే అతి విధ్వంసకరప్రక్రియ జనావాసం అసలే లేని నిర్జన ప్రదేశంగా ఉండే ఎడారిలో జరుపు కోవాలని ప్యపంచ వ్యాప్త పర్యావరణ నిబంధనలున్నాయి. కాని వాటికనుగుణంగా ఆస్ట్రేలియా ఖండమొక్కటే  తమ ఎడారిలో ఓపెన్ కాస్టు మైనింగ్ కొనసాగిస్తున్నది.అట్లాగే యునెస్కో గుర్తింపు పొందిన ప్రతి  ఏ ఒక్క వారసత్వ సంపదకు ఎటుచూసినా యాభై కిలోమీటర్ల వరకు ఎలాంటి విధ్వంసక పరిస్థితులు సృష్ఠించరాదు. దానికి విరుద్ధంగా  భాగంగానే సింగరేణి కంపెనీ పది కిలోమీటర్ల దూరంలోనే  ఓపెన్ కాస్టు మైనింగ్ ప్రక్రియ కొనసాగించడానికి సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదే నిజమైతే మన కండ్లముందు కళకళలాడిన శతాబ్ధాల  అత్యద్భుత శిల్ప సంపద నేలమట్టంమయ్యే వినాశకరం దాపురించబోతున్నది. కాబట్టి రామప్పకు సింగరేణి తలపెట్టబోతున్న పెనుముప్పును తొలగింపజేసి రామప్పను ఒక శిల్ప కళా విశ్వవిద్యాలయంగా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా తీర్చిదిద్దాలని  మన వంతుగా ములుగు జిల్లా కలెక్టర్ కు నేడు  ఉదయం 11-30గంటలకు విజ్ఞాపన పత్రం అందజేయనున్నారు. రామప్ప గుడి ప్రేమికులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాంమని రామప్ప  పరిరక్షణ కమిటీ తెలిపింది.


మే 17న పాలిసెట్‌


పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్‌-2023ను మే 17వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌తో జరిగిన సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారీ బాసర ఆర్‌జీయూకేటీ ఈ పరీక్షలో చేరడం లేదు. సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ శ్రీనాథ్‌, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.