Horoscope Today 4th January 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశి అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఒంటరిగా ఉండేవారు జంటని వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. కోపాన్ని నియంత్రంచుకోవాలి. అనవసర వాదనకు దిగొద్దు. కుటుంబంతో మంచి సమయం గడిపేందుకు సమయం కేటాయించండి
వృషభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు మంచి రోజు...మీ బంధాన్ని పెళ్లిదిశగా తీసుకెళ్లే ఆలోచన ఉంటే ఆ ప్రయత్నాలు చేయడం మంచిది. పెద్దల నుంచి ఆరంభంలో వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ తర్వాత సానుకూల ఫలితం పొందుతారు.
మిథున రాశి
మిథున రాశికి చెందిన ప్రేమికులు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు. కోపం తగ్గించుకుని ఓ మెట్టుదిగితే బంధం బలపడే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినా మీరు కావాలనుకున్న బంధాన్ని దక్కించుకోలేరు. మానసికంగా కొంత కృంగుబాటు ఉన్నప్పటికీ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
Also Read: జనవరి 2023 ఈ రాశివారికి పరీక్షా కాలమా అన్నట్టుంటుంది, ఆ 3 రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి
కర్కాటక రాశి
కర్కాటక రాశి ప్రేమికులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామి ఆశలకు మీరు మద్దతు ప్రకటిస్తారు. సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
సింహ రాశి
సింహరాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలు ఉంటాయి..వృత్తి వ్యాపారంలో లాభాల వల్ల వ్యక్తిగత జీవితంలోనూ సంతోషం పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా సహకారం అందుతుంది. ప్రేమ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రియమైన వారిని అనవసరంగా అనుమానించకండి. మాట తూలడం ద్వారా వారు మీకు దూరమయ్యే అవరాశం ఉంది.
తులా రాశి
తులా రాశి ప్రేమికుల జీవితం సాధారణంగా సాగుతుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది..ఆ దిశగా ప్రయత్నం చేయండి. సమస్యను పెంచుకుంటూ పోవద్దు.
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మూడో వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్యా సంబంధం చెడుతుంది జాగ్రత్త పడండి. ఈ రాశివారి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య కూడా అంతగా పొసగదు.
ధనుస్సు రాశి
ఈ రాశి ప్రేమికులు సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారికి సమయం కేటాయిస్తారు. వివాహితుల మధ్య పరస్పర అవగాహన మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది.
కుంభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ ప్రియమైన వారితో మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది.
మీన రాశి
వైవాహిక జీవితం బాగానే ఉన్నప్పటికీ ఏదో విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే వాదన పెట్టుకోవడం వల్ల ఇబ్బందిపడతారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితి సర్దుమణుగుతుంది.