Top Headlines on March 22nd:


1. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల


తెలుగు దేశం పార్టీ తన మూడో జాబితాను విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన జాబితాను విడుల చేసింది. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అటు, టికెట్లు ఆశించిన కీలక నేతలు ఈ లిస్టులోనూ టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కేటాయింపుపై పునరాలోచించాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


2. ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కంటైనర్ కలకలం


ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయం నడవబోతోంది. ఇప్పటికే దీనిపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారికి అనుకూలమైన మీడియాలో ఎదుటి వారిపై కథనాలు వండివారుస్తున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఒకట్రెండు కాదు ఏకంగా పాతిక వేల కిలోలు సరకు చిక్కింది. సీబీఐ చెప్పిన వివరాల ప్రకారం బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి వచ్చిన ఎస్‌ఈకేయూ 4375380 నెంబర్ ఉన్న కంటైనర్‌లో సరకు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


3. ఎన్నికల వేళ తాయిలాల ప్రవాహం


ఎన్నికలు సమీపిస్తుండటంతో నగదు ప్రవాహనం మొదలైపోయింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఎక్కడికక్కడ అక్రమ నగదును సీజ్‌ చేస్తున్నారు. అంతేకాదు... ఓటర్లను  ప్రలోభపెట్టేందుకు పార్టీల అభ్యర్థులు దాచిన బహుమతులను కూడా గుర్తించి పట్టుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలీసులు... ప్రలోభాలకు చెక్‌ పెడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


4. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ అధికారులు


ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితాను బీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ మధ్యకాలంలోనే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌, మరో మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్‌రామిరెడ్డికి టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


5. బెయిల్ పై కవితకు దక్కని ఊరట


లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్‌ పై ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టులోనే అప్లై చేసుకోవాలని సూచించింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. కేసులో ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఆమె పెట్టుకున్న పిటిషన్ కొట్టేసింది. రాజకీయ నాయకులు అయిన మాత్రాన ప్రత్యేక విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.