Lok Sabha Elections 2024: ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితాను బీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ మధ్యకాలంలోనే పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌, మరో మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్‌రామిరెడ్డికి టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. 


బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాం రెడ్డి ని పోటీకి దింపుతున్నారు.