Kejriwal Arrest Updates: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం దిగువ కోర్టుని ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ తరపున కోర్టులో హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ ఈ విషయం వెల్లడించారు. ఆయన పిటిషన్‌ని ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకి తెలిపారు. ఈ పిటిషన్‌తో రిమాండ్ పిటిషన్‌ క్లాష్‌ అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి కేజ్రీవాల్ పిటిషన్‌ని విచారించేందుకు అంతకు ముందే సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అత్యవసర విచారణకు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్‌ఎమ్‌ సుంద్రేశ్, జస్టిస్ బ్లీ ద్వివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన పిటిషన్‌ని వెనక్కి తీసుకున్నారు. 






మార్చి 21వ తేదీన సాయంత్రం కేజ్రీవాల్‌ని రెండు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఆ తరవాత ఆయనని అరెస్ట్ చేసింది. వెంటనే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఆప్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండి పడుతున్నారు. ఈడీ ఆఫీస్‌కి వెళ్లే దారుల్ని మూసేశారు. అసెంబ్లీకి సమీపంలో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు తప్ప అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాత్రంతా ఈడీ కస్టడీలోనే ఉన్నారు కేజ్రీవాల్. ఈడీ ఆఫీస్‌కి వెళ్లే ముందు ఆయన డిన్నర్ చేశారు. అక్కడి నుంచి ఈడీ హెడ్‌క్వార్టర్స్‌కి తరలించారు. రాత్రంతా ఆయన నిద్రపోలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఉన్న గదిలో AC అందుబాటులో ఉన్నా బెడ్ ఇవ్వలేదు. ఓ పరుపు, బ్లాంకెట్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకి షుగర్ ఉండడం వల్ల ఇంటి నుంచి మెడిసిన్ తెప్పించారు. ఇదే కాంప్లెక్స్‌లో మరో సెల్‌లో కల్వకుంట్ల కవితని ఉంచి విచారిస్తున్నారు. అయితే...కేజ్రీవాల్ భద్రతపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి కేజ్రీవాల్ పిటిషన్‌ని విచారించేందుకు అంతకు ముందే సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అత్యవసర విచారణకు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్‌ఎమ్‌ సుంద్రేశ్, జస్టిస్ బ్లీ ద్వివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన పిటిషన్‌ని వెనక్కి తీసుకున్నారు. 


Also Read: చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి కానుక, రామాయణం స్ఫూర్తితో చేశాడట