ప్రకాశం మరో నెల్లూరు కాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు - పార్టీ నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు !
ప్రకాశం జిల్లా రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా సీరియస్‌గా పరిశీలన చేస్తోంది.  ఇప్పటికే నెల్లూరు ఎపిసోడ్  వైసీపీలో కలకలం రేపింది.  నెల్లూరులా ప్రకాశం జిల్లా మారకుండా సీఎం  జగన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవలి  రాజకీయ పరిణామాల దృష్ట్యా   ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మధ్య విభేధాల పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు.  బాలినేని ఎపిసోడ్ లో చోటు చేసుకున్న పరిణామాలు పై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, పార్టీ వర్గాల నుండి ప్రత్యేకంగా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు.  ఇంటలిజెన్స్ తో  పాటు ఇతర నివేదికలను కూడా  ముఖ్యమంత్రి తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు.  అత్యంత విశ్వసనీయ సమాచారం అవసరం కావడంతో సాక్షి మీడియాతో పాటు ఐ ప్యాక్ టీం, ఇతర మార్గాలు, సన్నిహితల నుండి కూడా పార్టీ వ్యవహారాలపై సీఎం సమాచారం తెలుసుకుంటున్నారు.  పరిస్థితిని చక్కదిద్దాలని అనుకుంటున్నారు.  


చేయిదాటిపోయేదా నెల్లూరు విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో మైనస్! 
ఇటీవల  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు ఎపిసోడ్ ఒ కుదుపు కుదిపింది. రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీపై జగన్ పట్టు జారిపోయిందన్న  విశ్లేషణలు నెల్లూరులో పార్టీ ఎమ్మెల్యేల ధిక్కరణ ద్వారా వచ్చాయి. ముఖ్యంగా కోటంరెడ్డి తిరుగుబాటు విషయంలో అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి వైసీపీలో ఉంది. చనిపోతే తన శవం పై కూడా జగనే జెండా కప్పాలంటూ కోటం రెడ్డి చెప్పేవారు. అలాంటి నేత పార్టీ నుంచి వెళ్లిపోయారు.  అదే సమయంలో కోటం రెడ్డి  బయటకు వెళ్లినప్పటి నుండి వైసీపీపై తీవ్ర స్థాయి పోరాటం చేస్తున్నారు.  జగన్ సైతం కోటం రెడ్డి ఎపిసోడ్ పై ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీలో అంతర్గత గొడవల వల్లనే ఇలా జరుగుతోందని చివరికి గుర్తించారు.  ఇంకా చదవండి  


పొంగులేటి నోట సొంత పార్టీ మాట - జాతీయ పార్టీల ఆఫర్లు నచ్చలేదా ?
ఖమ్మం సీనియర్ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట సొంత పార్టీ మాట వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతు భరోసా ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన... కలెక్టరేట్ ఎదుట ధర్మా చేశారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 30 వేల రూపాయులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అవసరం అయితే సొంత పార్టీ పెడతానని ప్రకటించారు. పొంగులేటి ప్రకటన తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం అవుతోంది. ఆయన యథాలాపంగా అన్నారా.. లేకపోతే నిజంగానే ప్లాన్ ఉందా అన్నది చర్చనీయాంశమవుతోంది. 


రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్న పొంగులేటి 
పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మినహా దాదాపు అన్నిరాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పొంగులేటి కోసం భారీ ఆఫర్లు ఇచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో ఎనిమిది .. పార్లమెంట్ స్థానంతో సహా ఆయన వర్గానికే ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టింది. అయితే పొంగులేటి ఏమీ చెప్పలేదు. తర్వాత బీజేపీ చేరికల కమిటీ కూడా ఆయనతో చర్చించంది. ఏం ఆఫర్లు ఇచ్చారో స్పష్టత లేదు కానీ..  త్వరలో చెబుతామని ప్రకటించారు.  సమయం పడుతుందని పొంగులేటి చెప్పుకొచ్చారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనకు ఆఫర్లు ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. వారితో కూడా చర్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు.  ఇంకా చదవండి  


ఐరన్ లెగ్ చంద్రబాబూ రైతుల దగ్గర షో చేయొద్దు, మంత్రి కాకాణి వంగ్యాస్త్రాలు
ఏపీలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని చంద్రబాబు పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అసలు జగన్ రైతుల్ని కలిసేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రులు ఎక్కడికెళ్లిపోయారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కౌంటర్ గా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదన్నారు కాకాణి. 


చంద్రబాబు హయాంలో ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం పట్టుకునేదని సెటైర్లు వేశారు కాకాణి. ఆయన పాదం మోపిన చోట అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి ఉండేదన్నారు. అందుకే ఆయన రావొద్దని రైతులు కోరుకునేవారని, ఆయన్ను అధికారానికి దూరం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు రైతులపేరుతో చంద్రబాబు నంగి నంగి మాటలు మాట్లాడుతూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు.   ఇంకా చదవండి 


కర్ణాటకలో ఎన్నికలు - ఏపీలో చెక్ పోస్టులు ! ఎన్నికల సంఘం ప్లాన్ మామూలగా లేదు !
కర్ణాటక ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ పేరుతో జరిగే డబ్బు, మద్యం పంపిణీలను అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం  సరిహద్దు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌, డీజీపీలతో  వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల  ర పోలీసు యంత్రాంగం  సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.  డబ్బు, మద్యం అక్రమ రవాణా జగరకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.    


ఏపీ సరిహద్దు జిల్లాలలపై ఎక్కువ దృష్టి ! 
ఏపీలో  కర్నాటకకు ఆనుకుని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాలు ఉన్నాయి.  రిహద్దు జిల్లాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ ఎన్నికల నిబంధనలు పూర్తి స్ధాయిలో అమల్లోకి రానున్నాయి. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఓటర్లను ప్రలోబపరిచేందుకు మద్యం, నగదు, ఇతర బహుమతులు, సామాగ్రిని సరిహద్దు మార్గాల ద్వారా కర్నాటకకు వెళ్ళకుండా నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్నాటకలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మద్యం నిషేధం ఉంటుంది. దీంతో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాగం మద్య నిషేధం అమలు చేయనుంది.  ఇంకా చదవండి


అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ భూమిపూజ
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు.  ఇంకా చదవండి