అధికారంలో ఉంటే అమరావతిలో లేకుంటే జూబ్లీహిల్స్‌లో: జగన్
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రూ. 4 వేల మాత్రమే ఇచ్చారని, అది కూడా కొందరికి మాత్రమే అందేదని అన్నారు. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్కకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. టీడీపీ పాలనలో 1100 బోట్లకు మాత్రమే రాయితీ ఇస్తే.. ఇప్పుడు 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో డీజిల్ పై రూ.6 మాత్రమే రాయితీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో డీజిల్ పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనను చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. పేద వారికి సాయం చేస్తుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


నల్గొండ ఎమ్మెల్యే టికెట్‌పై గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడి గురి- గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్న అమిత్‌రెడ్డి!
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గులాబీ పెద్దల ఆశీర్వాదంతో తనయుడిని ఎమ్మెల్యేను చేయాలని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సమయం లేదు బిడ్డా అంటూ కుమారుడిని ప్రొజెక్టు చేస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదం లభించిందని అందుకే కుమారుడిని ప్రజల్లోకి తీసుకొచ్చారనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 


విదేశాల్లో చదువుకున్న గుత్తా అమిత్ రెడ్డి వ్యాపారాల్లో రాణించారు. రాజకీయాల్లో ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో మంచి టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చిందని గుత్తా అనుచరులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సీటు పక్కా అవుతుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇంతలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, అమిత్‌ రెడ్డి సమాజిక సేవా కార్యక్రమాలతో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే కొన్ని నెలల కిందట తన తాత గుత్తా వెంకట్ రెడ్డి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీనం నిజమేనా ? షర్మిల ఏమన్నారంటే ?
తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు , విలీనంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల నుంచి మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం చార్జింగ్ మోడ్ లో ఉన్నామని వ్యాఖ్యానించారు. అంటే పొత్తులు విలీనాల అవకాశాల్ని పూర్తిగా కొట్టి పారేయలేదు. ఖండించలేదు. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. నేను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దు అని చెప్పదని.. వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం ఉందన్నారామె. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 


అన్ని పార్టీల్నీ పొగుడుతున్న జేడీ లక్ష్మినారాయణ - సీటు కోసమే ప్రయత్నలా ?
సీబీఐ మాజీ జేడీ, మాజీ జనసేన నేత వీవీ లక్ష్మినారాయణ రాజకీయం భిన్నంగా సాగుతోంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఏ పార్టీలో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు. ఇటీవల విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అందుకే ఆయన సోషల్ మీడియా ప్రకటనలు తరచూ భిన్న చర్చలకు కారణం అవుతున్నాయి. తాజాగా చంద్రబాబునాయుడు విజన్ ను అభినందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన సూచనలకు  మద్దతిచ్చారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి   


అవినాష్ రెడ్డిపై స్పందించిన సీబీఐ - మళ్లీ ఎప్పుడు రావాలని చెప్పిందంటే ?
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. వాస్తవానికి ఇవాళే ఆయన సీబీఐ ఎదుట రాజరు కావాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చివరి క్షణంలో అవినాష్ రెడ్డి లేఖ రాశారు. నాలుగు రోజుల పాటు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. 19వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి