Top Headlines In AP And Telangana:
1. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుపాను హెచ్చరికలను చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వర్షావరణం ఏర్పడింది. ఇదే నెలలో బంగాళాఖాతంలో రెండు, అరేబియా సముద్రంలో ఒక తుపాను ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రెండు మూడు రోజుల్లోనే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతుందని అంటున్నారు. దసరా అంటేనే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత ప్రజలు వణికిపోతారు. చాలా కాలం నుంచి దసరా టైంలో తుపాను చుట్టు ముట్టి అల్లకల్లోలం చేయడాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా చదవండి.
2. ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్ సమ్మిట్
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఈ నెల 22-23వ తేదీల్లో అమరావతిలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్రోన్ సమ్మిట్ వివరాలను పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్స్ రాజధానిగా మార్చాన్న చంద్రబాబు ఆశయానికి అనుగణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మంగళగిరిలోని సీకే కన్వెషన్‌లో 22న సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహననాయుడు పాల్గొంటారు. ఇంకా చదవండి.
3. టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణలో రాజకీయా మరోసారి హీటెక్కే న్యూస్ ఇది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీని పరుగులు పెట్టించే చర్యలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణలో చురుగ్గా ఉన్న నేతలు సమావేశమవుతున్నారు. చాలా రోజుల క్రితం బాబూ మోహన్ లాంటి వాళ్లు సమావేశమయ్యారు. ఇప్పుడు మరికొందరు హైదరాబాద్ నేతలు భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంకా చదవండి.
4. కొండా సురేఖపై పరువునష్టం దావా - కోర్టుకు నాగార్జున
కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసులో నాగార్జున మంగళవారం కోర్టుకు హాజరై తన స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. సోమవారం జరిగిన విచారణ నాగార్జున తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఇంకా చదవండి.
5. పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారంటూ వచ్చిన వార్తలను స్వయంగా ఆయనే ఖండించారు. ఈ ఉదయం, రతన్ టాటాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. రతన్ టాటాకు రక్తపోటు (Blood Pressure - BP) సంబంధించిన సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆయన్ను IUCలో ఉంచి చికిత్స అందిస్తున్నారని కూడా పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. ఈ అబద్ధపు వార్తలు రతన్ టాటా దృష్టికి వెళ్లడంతో, ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా వయస్సు 86 సంవత్సరాలు. ఇంకా చదవండి.