ఈ ఏడాది మొదట్లోనే 'ఓం భీమ్ బుష్' అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర మాయ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా 'శ్వాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్టోబర్ 4 న రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్ ల విషయంలో మాత్రం స్లో అయింది. మరి ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్ ఎంత అనే విషయాన్ని చూసేద్దాం పదండి. 


కలెక్షన్స్ లో కన్పించని 'శ్వాగ్'
టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ హాసిత్ గోలి కాంబినేషన్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైన్స్ 'శ్వాగ్ '. 'రాజరాజ చోరా' సినిమా తర్వాత శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఇది. రీతూ వర్మ, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ లు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 1.35 కోట్లు మాత్రమే రాబట్టి కలెక్షన్ల పరంగా ఓకే ఓకే అనిపించింది. శ్రీ విష్ణు సినిమా రెండవ రోజు 1.8 కోట్ల కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకుంది. కానీ మూడవరోజు అంతకంటే దారుణంగా తక్కువ కలెక్షన్లు రాబట్టి చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. 


Read Also ; Mamitha Baiju: విజయ్ చివరి సినిమాలో ఛాన్స్ పట్టేసిన 'ప్రేమలు' హీరోయిన్ మమిత బైజు ఏం చదివిందో తెలుసా?


ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ ఏరియా వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే నైజాంలో రూ.83 లక్షల షేర్, రూ.2.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే ఏపీలో రూ. 70 లక్షల షేర్, రూ.1. 76 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కర్ణాటకలో రూ.15 లక్షల షేర్, రూ. 38 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ను  రాబట్టింది 'శ్వాగ్ ' మూవీ. ఇక యూఎస్ఏ లో రూ.68 లక్షల షేర్, రూ. 1. 70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మిగతా ఏరియాలో మూడు రోజుల్లో రూ.20 లక్షల షేర్, రూ.50 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూడు రోజుల్లో మొత్తంగా 'శ్వాగ్ ' మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్లను చూసుకుంటే షేర్ రూ. 2.56 కోట్లు, రూ.6.48 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ లెక్కలన్నీ జిఎస్టి తో కలిపి. అయితే సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ ను బట్టి చూస్తే 'శ్వాగ్ ' మూవీ రాబడుతున్న కలెక్షన్స్ నిర్మాతలకు దెబ్బేసేలాగే ఉన్నాయి. 


'శ్వాగ్ ' మూవీ థియేట్రికల్  బిజినెస్... 
శ్రీ విష్ణు గత సినిమా 'ఓం బీమ్ బుష్' బాగానే ఆడడంతో తాజాగా 'శ్వాగ్ ' మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ డీల్ సెట్ అయింది. కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పర్ఫామెన్స్ చూస్తుంటే ఈ సినిమా సేఫ్ జోన్ లో కి వెళ్తుందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 8 కోట్లు కాగా, ఆ లెక్కన సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మొత్తంగా 7.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి వీకెండే ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే సోమవారం బాక్స్ ఆఫీస్ గండాన్ని గట్టెక్కుతుందా అన్నది అనుమానమే.