సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే అదే రోజున రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్, సూర్య సినిమాలతో అశోక్ గల్లా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రెడీ అయ్యాడు. 


'దేవకి నందన వాసుదేవ' రిలీజ్ డేట్ 
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే అశోక్ నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక తాజాగా మరో సినిమాను మొదలు పెట్టిన అశోక్ 'దేవకి నందన వాసుదేవ' మూవీతో రెండవసారి థియేటర్లలో తన లక్ ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అశోక్ మాస్ అవతార్లో కనిపించబోతుండగా, 'గుణ 369' సినిమాకు దర్శకత్వం వహించిన అర్జున్ జంధ్యాల ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ 'దేవకీ నందన వాసుదేవ' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 14న గురు పూర్ణిమకు ఒక రోజు ముందు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో అశోక్ ఇంటెన్స్ లుక్ లో అదరగొట్టాడు. ఓవైపు విలన్ ను, మరో వైపు సాధువును చూపిస్తూ.. బ్యాక్ గ్రౌండ్లో శ్రీకృష్ణ విగ్రహాన్ని కనిపించేలా డిజైన్ చేసిన ఆ పోస్టర్ ద్వారా థీమ్ ఏంటి అన్న విషయాన్ని స్పష్టం చేశారు. అందులో ఆధ్యాత్మిక అంశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి అన్న విషయం అర్థం అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే మేకర్స్ రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్లలో జోరు పెంచబోతున్నారు. ఈ సినిమాలో అశోక్ సరసన వారణాసి మానస హీరోయిన్ గా నటించింది. 'హనుమాన్' మూవీకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథను అందించడం అంచనాలను పెంచేసింది. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. 






 


సూర్య, వరుణ్ తేజ్ లతో అశోక్ గల్లా ఫైట్ 
ఇక మేకర్స్ 'దేవకీ నందన వాసుదేవ' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అఫీషియల్ గా వరుణ్ తేజ్, సూర్యలతో బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సిద్ధమంటూ హింట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మట్కా' కూడా నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువా' మూవీ కూడా అదే రోజున రిలీజ్ కాబోతోంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 14న థియేటర్లలో సూర్య నటిస్తున్న 'కంగువ', మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలతో ఢీకొనడానికి 'దేవకి నందన వాసుదేవ' సినిమాతో అశోక్ రెడీ అవుతుండడం విశేషం.  మరి ఇద్దరు స్టార్ హీరోలతో పోటీపడి 'దేవకీ నందన వాసుదేవ'తో అశోక్ హిట్ అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.



Read Also : Tollywood : మెగా జాతర షురూ... అక్టోబర్ నుంచి జనవరి దాకా - వరుసగా ఫ్యాన్స్ ఆకలి తీర్చబోతున్న మెగా హీరోలు