మెగా అభిమానులు గత మూడేళ్ల నుంచి తీరని ఆకలి మీద ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ల నుంచి తెరపైకి సినిమా రాక దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇక ఈ ఆకలినంత తీర్చేలా ఇప్పుడు 2024 ద్వితీయార్థం మొత్తం మెగా జాతర జరగబోతోంది. 


స్లో అయిన చిరు, చెర్రీ 
మెగా కాంపౌండ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ అందులో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే ఆయన వారసత్వాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా సపరేట్ గా ఇదే రేంజ్ లో దూసుకెళ్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటే సపరేటు అన్న విషయం తెలిసిందే. కాగా మెగా కాంపౌండ్ మొత్తం సినిమాల విషయంలో బాగా స్లో అయింది. పవన్ కళ్యాణ్ 2022లో 'భీమ్లా నాయక్' సినిమాతో సోలోగా వచ్చి హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత 'బ్రో' అంటూ సాయి ధరం తేజ్ తో కలిసి ఆయన చేసిన సినిమా బెడిసి కొట్టింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 2023లో 'వాల్తేరు వీరయ్య' మూవీతో చివరిసారిగా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'భోళా శంకర్' బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి, ఆచి తూచి 'విశ్వంభర' మూవీకి సైన్ చేశారు చిరంజీవి. చెర్రీ నుంచి చివరగా వచ్చిన మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమాలో కీలకపాత్రలో నటించినప్పటికీ ఈ సినిమా మెగా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మొత్తానికి 2022 తర్వాత మెగా అభిమానులకు సెలబ్రేట్ చేసుకోవడానికి సరైన అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు మెగా అప్డేట్స్ తో వరుసగా సిద్ధమవుతున్నారు మెగా హీరోలు.


Read Also ; OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్


మెగా జాతర షురూ 
తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీలోని 'రా మచ్చా మచ్చా' సాంగ్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా 'మట్కా' టీజర్ తో వరుణ్ తేజ్ దాన్ని కంటిన్యూ చేశారు. ఇలా 'గేమ్ ఛేంజర్' నుంచి మొదలు పెడితే సంక్రాంతికి 'విశ్వంభర' వరకు వరుసగా మెగా సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ నడుస్తుండగా, దసరాకు ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది. మరోవైపు నవంబర్ 14న రిలీజ్ కాబోతున్న 'మట్కా' మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్న 'పుష్ప 2' టీజర్ నవంబర్లోనే రిలీజ్ కాబోతోంది అన్నది తాజా టాక్. 'విశ్వంభర' టీజర్ దసరాకు రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుండగా, ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ మరోవైపు 'విశ్వభర' సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటుందని, 'గేమ్ ఛేంజర్' ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తుందని అంటున్నారు. మధ్య మధ్యలో పవన్ సినిమాల అప్డేట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా అక్టోబర్ నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు కంటిన్యూస్ గా మెగా హీరోల సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో గత రెండేళ్లుగా వెయిట్ చేస్తున్న మెగా అభిమానుల ఆకలి తీరబోతోంది. ఇలా ఇప్పటినుంచి మొదలైన ఈ సంబరాలు సంక్రాంతి వరకు కంటిన్యూ కాబోతుండగా.. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే ఏడాది మొదలు వరకు మెగా నామస్మరణ జరగబోతోంది.


Read Also : VD12 Movie: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్