సీఎం జగన్‌కు ముప్పు - జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి ఇంటలిజెన్స్ నోట్ !


ఏపీ సీఎం జగన్ కు ఐసిస్, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆయనకు భద్రత కల్పించడం కోసం జడ్ ప్లస్ సెక్యూరి్టీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఏ ప్రాతిపదికన జగన్ కు .. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందో లేదో ఇంకా  క్లారిటీ లేదు. 


ప్రస్తుతం సీఎం జగన్ కు కమాండో భద్రత 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత భద్రత కు పటిష్టమైన యంత్రాంగం ఉంది.  ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్‌ను సీఎం వైఎస్ జగన్‌ భద్రతలో భాగం చేశారు.  కౌంటర్‌ టెర్రరిజంలో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన ఈ బలగాలు రక్షణ విధఉల్లో ఉన్నాయి.  సీఎం భద్రతలో ఉన్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ తోపాటు   అదనపు భద్రత కోసం ఆక్టోపస్‌ టీమ్‌ కూడా పనిచేస్తోంది. 30 మంది సభ్యులు గల ఆక్టోపస్‌ టీమ్‌ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి నిర్ధేశించిన విధులును చేపడతారు. ఈ ఆక్టోపస్ బృందాలు సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంగా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఇంకా చదవండి


వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు, అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు


కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాటకు దిగారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గొడవ జరిగింది. ఇంకా చదవండి


తెలంగాణలో వేద పండితుల గౌరవ భృతి 5 వేలకు, ఆలయాల నిర్వహణ సాయం 10 వేలకు పెంపు


ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద ఇస్తున్న6 వేల నగదు సాయాన్ని 10 వేలకు, వేద పండితుల గౌరవ భృతిని 5 వేలకు పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి వేద పండితులకు గుడ్ న్యూస్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. భృతిని పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల వయసు పరిమితి నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వివరించారు. అలాగే మరో 2796 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే కాకుండా ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల నిర్వహణకు అర్చకులకు ఇస్తున్న నగదు సహాయం రూ. రూ.6000 నుంచి రూ.10000 పెంచారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం రూ. 2 లక్షల వార్షిక గ్రాంట్‌గా ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని వెల్లడించారు. ఇంకా చదవండి


సత్తెనపల్లిలో అంబటి వర్సెస్‌ కన్నా లక్ష్మీనారాయణ- మరి కోడెల వర్గం సర్దుకుంటుందా?


సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు లైన్ క్లియర్ అయింది. ఆయన్ని ఇంఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అంబటి రాంబాబు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టు పోరు సాగనుంది. 


తెలుగు దేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లలో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే జిల్లా కేడర్‌కు పూర్తి సంకేతాలు పంపిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌ల నియామకం స్టార్ట్ చేసింది. అత్యంత కీలకమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను నియమించింది. దీంతో సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకా చదవండి


అవినాష్ రెడ్డి తల్లి సర్జరీపై కోర్టుకు తప్పుడు సమాచారం - చర్యలు తీసుకోవాలని సునీత లాయర్ మెమో!


వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు  సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు అవినాశ్ రెడ్డికి స్పష్టం చేసింది. మరో వైపు  వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ తరుపు న్యాయవాది చెప్పారని.. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.  ఈ రోజు కోర్టులో వివేకా కూతురు సునీత తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అవినాష్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందున అవినాష్ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని సునీత తరపు లాయర్ మెమో వేశారు. ఇంకా చదవండి