తెలంగాణలో జరుగుతున్న 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవం అయ్యే  అవకాశం ఉంది. ఇతర పార్టీలు పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. నిజానికి 12 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్‌కు విజయం సాధించడానికి అవసరమైన స్పష్టమైన బలం ఉంది. అయితే అదే సమయంలో కనీసం నాలుగైదు చోట్ల కనీసం పోటీ ఇవ్వడానికి అవకాశం ఉన్న స్థాయిలో ఇతర పార్టీలకు ప్రతినిధులు ఉన్నారు. కానీ పోటీ  చేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 


Also Read: Mlc Elections: టీఆర్ఎస్ స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...!


ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అధినేత మత్రమే అభ్యర్థుల్ని ప్రకటించి బీఫాం ఇచ్చారు. ఇతర పార్టీల్లో అభ్యర్థులపై ఎలాంటి చర్చ జరగలేదు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఓ కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కల్వకుంట్ల కవిత పోటీ చేసినప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి కాంగ్రెస్ పోటీ పెట్టింది. నల్లగొండ, ఖమ్మం వంటి చోట్ల పోటీ చేయడానికి తగినంత బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది.





 


Also Read: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు


కానీ ఆ పార్టీ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదు. పోటీ చేయడం వల్ల గెలిచే అవకాశం ఎలాగూ ఉండదు.. మళ్లీ సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో  అభ్యర్థిగా నిలబడాలంటే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాలి. ఓటు వేయాంటే సొంత పార్టీ ప్రజాప్రతినిధులకైనా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే పెద్దగా పోటీ చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ కారణాలతో టీఆర్ఎస్‌కు అన్ని స్థానాలూ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: TSRTC: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్


ఇప్పటికి మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే సభ్యుడిగా ఉన్నారు. ఆయన పట్టభద్రుల కోటా నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామచంద్రరావు కూడా ఇటీవల జరిగిన పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆ పార్టీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మండలిలో టీఆర్ఎస్‌కు తిరుగులేనంత ఆధిపత్యం ఉంది.  



Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి