YS Sharmila : వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ కోర్టును షర్మిల ఆశ్రయించారు.  పాదయాత్ర కి అనుమతిచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని షర్మిల పిటిషన్‌లో కోరారు.  పాదయాత్ర తో పాటు వరంగల్ బహిరంగ సభ కు అనుమతి కోరారు. కోర్ట్ అనుమతి ఇచ్చిన తర్వాత  పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని విచారణలో హైకోర్టు ప్రశ్నించింది.  రాజకీయ నాయకులు అందరూ పాదయాత్ర కోసం  కోర్ట్ లు చుట్టూ  తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది  తెలంగాణ ను తాలిబాన్ ల రాష్ట్రం గా మారుస్తున్నారని షర్మిల వాఖ్యనించారని..  కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా అభ్యంతకర వాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెల్లారు. అయితే రాజ్ భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్ర కు ఎందుకు అనుమతి నిరాకరించారని హై కోర్టు ప్రశ్నింంచింది.  హైకోర్టు అనుమతితో షర్మిల పాదయాత్ర పునంప్రారంభమానికి మార్గం సుగమం అయింది.  


లోటస్‌పాండ్‌లో షర్మిల ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు


మరో వైపు లోటస్ పాండ్‌లోని షర్మిల ఇంటి వద్ద పోలీసులు  పెద్ద ఎత్తున మోహరించారు. షర్మిలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ట్యాంక్ బండ్ వద్ద దీక్షకు దిగిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఇంటి వద్ద విడిచి పెట్టారు. ఆ సమయంలో ఆమరణదీక్ష చేశారు షర్మిల. ఆరోగ్యం క్షీణించడంతో ... ఆమె ధీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల ట్రీట్ మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. రెండు, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలన్నారు. అయితే షర్మిల వెంటనే పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. 


మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల 


షర్మిల ఇప్పటికే మూడున్నర వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర పూర్తి చేశారు.  అయితే నర్సంపేటకు వచ్చే సరికి  టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహించి పాదయాత్రను అడ్డుకోవడం, షర్మిల బస్సును తగులబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిల హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగాలనుకున్న ప్రయత్నం చేశారు. ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం వివాదాస్పదమయింది. అప్పుడే కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి కోసం ప్రయత్నించారు.  ఎవ్వరినీ రెచ్చగొట్టకుండా, విద్వేషాలకు కారణగాకుండా పాదయాత్రను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అపిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించించాలని అనుకున్నారు. రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. 


మరో పది రోజుల్లో పూర్తి కానున్న పాదయాత్ర 


ఇప్పటికే 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల మరో 250 కిలోమీటర్ల అనంతరం వరంగల్ భారీ బహిరంగ సభ తర్వాత పాదయాత్రకు విరామమివ్వాలని అుకుంటున్నారు.   ముందుగా అనుకున్నట్లుగా డిసెంబర్  పాదయాత్ర జరిగి ఉంటే... గ్రేటర్ మినహా అన్ని చోట్ల పాదయాత్ర పూర్తయి ఉండేది.  ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రారంభించనున్నారు కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే పోలీసులు మళ్లీ అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై .. స్పష్టత రావాల్సి ఉంది. 


బీఆర్ఎస్ కు షాకిచ్చిన దిల్లీ అధికారులు, ప్రారంభోత్సవానికి ముందే ఫ్లెక్సీలు తొలగింపు!