తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా స్థానాల కోసం నామినేషన్లకు చివరి తేదీ 16. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలకు సమయం ఉంది. అయితే ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు ఎమ్మెల్యే కోటా, ఇటు స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కానీ తెలంగాణ అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ముందుగా ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఆరు స్థానాలపై దృష్టి పెట్టారు. 


Also Read : ఖమ్మం ఎమ్మెల్సీ రేసులో తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ మెచ్చేదెవరు?


 టీఆర్ఎస్ అధినేత గత రెండు, మూడు రోజులుగా ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అన్ని మెరిట్స్ చూసి ఇప్పటి వరకూ నలుగుర్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.  గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ఖరారైనట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరో ఇద్దర్ని ఖరారు చేసేందుకు పలువురు పేర్లు పరిశీలిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవలి వరకూ మండలి ఛైర్మన్‌గా చేశారు. మరోసారి చాన్సివ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నల్లగొండ స్థానిక రాజకీయాలు కూడా గుత్తాకు అనుకూలంగా ఉన్నాయి. 


Also Read: సీఎం జగన్ బిచ్చమెత్తుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి... సీఎం కేసీఆర్ దిల్లీ ఎందుకు వెళ్తున్నారని ఏపీ మంత్రి కౌంటర్


మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఉద్యమం నాటి నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన గండ్రను పార్టీలో చేర్చుకోవడంతో నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం రాకుండా ఆయనకు చోటు కల్పించనున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఉద్యమకారుడే. ఆయనకు అనేక సార్లు అవకాశాలు  మిస్ అయ్యాయి. ఈ సారి కేసీఆర్ చాన్సిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆకుల లలితకు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం కంటిన్యూషన్ ఇస్తున్నారు. 


Also Read: ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?


మరో ఇద్దరు పేర్లపై కసరత్తు జరుగుతోంది. పదుల సంఖ్యలో నేతలు తమకు పదవులు ఇవ్వాలని లాబీయింగ్ చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఏకంగా 12 స్థానాలు ఉండటంతో  వాటిలో కొంత మందిని సర్దుబాటు చేసే అవకాశం ఉంది. సోమవారం కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటిచే అవకాశం ఉంది. అదే రోజు అందరూ నామినేషన్లు వేస్తారు. ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని మండలికి పంపడం లేదు. గవర్నర్ కోటాలోనే మరోసారి సిఫార్సు చేసి అయినా కౌశిక్ రెడ్డిని మండలికి పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సారి స్పోర్ట్స్ కోటా కింద ఆయనను సిఫారసు చేయాలని భావిస్తున్నారు.


Also Read : రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్... ఇవాళ తిరుపతికి అమిత్ షా, జగన్... కేసీఆర్ డుమ్మా...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి