Telangana BJP : తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మూడో రోజుకు చేరిన ఒక్కరంటే ఒక్క సీనియర్ నేత కూడా దరఖాస్తు చేసుకోలేదు. అంతా ద్వితీయ శ్రేణి నేతలే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తులు  చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో. .. రేవంత్ రెడ్డి సహా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ నాయకత్వం కూడా దాదాపుగా అలాంటి సంకేతాలనే ఇచ్చింది. వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి.. అందులో ఉన్న  వారికే చాన్స్ ఇస్తామని చెబుతోంది. అయినా సీనియర్లు పెద్దగా స్పందించడం లేదు. 


సీనియర్లు అందరూ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసిన ప్రకాష్ జవదేకర్ 


తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న ప్రకాష్ జవదేకర్..   దరఖాస్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని బీజేపీ ఇంచార్జ్ ప్రకాష్ జావదేకర్ పరిశీలించారు.  ఇప్పటి వరకూ టికెట్ కోసం బీజేపీ ముఖ్యనేతలు దరఖాస్తు చేసుకోలేదని తెలియడంతో అసహనానికి గురయ్యారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ముఖ్య నేతలు ఏ ఏ నియోజకవర్గాల్లో టికెట్ కోసం దరఖాస్తు చేస్తారనే దానిపై బీజేపీలో ఆసక్తి చర్చ కొనసాగుతోంది.  ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ లోపు సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకుంటారని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొంత మంది దరఖాస్తు చేసుకోకపోతే ఇవ్వరా.. అన్న పట్టుదలతో . ఉన్నట్లుగా చెబుతున్నారు.  


మరోసారి కోమటిరెడ్డి అలక - బుజ్జగించిన మాణిక్ రావు థాక్రే !


పోటీ పడి దరఖాస్తులు చేసుకుంటున్న ద్వితీయశ్రేణి నేతలు            


దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు రంగారెడ్డి, సుభా్‌షచందర్‌జీ, దాసరి మల్లేశంతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ద్వితీయ శ్రేణి నేతలే దరఖాస్తులు చేస్తూ వస్తున్నారు.   కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ.. వేములవాడ  నియోజకవర్గం టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణితోపాటు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో భాగంగా ఆశావహుల విద్యార్హతలు, కులం, ఏ సంవత్సరం పార్టీలో చేరారు? గతంలో ఏదైనా ఎన్నికల్లో పోటీ చేశారా? క్రిమినల్‌ కేసులు ఏమైనా ఉన్నాయా?వంటి వివరాలను తీసుకుంటున్నారు. కాగా, దరఖాస్తుదారులెవ్వరూ మీడియాతో మాట్లాడవద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశించారు.  


మాకో మాటైనా చెప్పాలిగా, ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి? ప్రధానికి సోనియా గాంధీ లేఖ


బీఆర్ఎస్ కీలక నేతలపై సీనియర్లు పోటీ చేస్తారని ప్రచారం         


బీజేపీలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు పరిమితంగానే ఉన్నారు.  అగ్రనేతలు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వారు తమ నియోజకవర్గాలకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రకాష్ జవదేకర్ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో..  పదో తేదీ లోపు అందరూ దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది.