yuvagalam Tension : యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ పై అర్థరాత్రి పోలీసులు దాడి చేసి యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు.  3 వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం వాలంటీర్లు, కిచెన్‌ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ పలు చోట్ల తిప్పారు.   భీమవరం, నర్సాపురం, వీరవాసరం కాళ్ల పోలీస్‌స్టేషన్లు తిప్పారు. ప్రస్తుతం వారిని సిసిలిలోని రాజ్యలక్ష్మి మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్యాక్టరీలో ఉంచారు. ఇది వైఎస్ఆర్‌సీపీ నేతకు చెందిన ఫ్యాక్టరీ కావడంతో టీడీపీ నేతలు పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 


 





 


యువగళం పాదయాత్రపై భీమవరం నియోజకవర్గంలో దాడి జరిగింది.  సోడా బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులుచేశారు.  ఈ దాడిలో ఐదుగురు కానిస్టేబుళ్లతోపాటు యువగళం వలంటీర్లు పలువురు టీడీపీ నేతలకు గాలయ్యాయి.  తాడేరు రోడ్డులో లోకేష్ పాదయాత్ర వస్తున్న సమయంలో సుధ అనే రౌడీషీటర్ నేతృత్వంలో కొంత మంది గూమికూడి దాడులకు ప్రయత్నిస్తున్నారని వాలంటీర్లు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారిని  నియంత్రించలేదన్న ఆరోపణలు చేస్తున్నారు.  ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, భీమవరం టిడిపి నేత పృధ్వి, పలువురు టిడిపి కార్యకర్తలు గాయపడిన వారిలో ఉన్నారు.   





 


తమపై దాడులు చేస్తున్న వారిపై యువగళం కార్యకర్తలు తిరగబడ్డారు. దాంతో రెండు వైపులా ఘర్షణ జరిగింది.  గాయపడిన టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు, కార్యకర్తలకు యువగళం కాన్వారులోని అంబులెన్స్‌లో చికిత్స అందించారు. గాయపడిన వారు భీమవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో యువగళం పాదయాత్రపై దాడులకు దిగిన వారిపై ప్రతిదాడులకు చేశారని కేసులు నమోదు చేసిన పోలీసులు అర్థరాత్రి యువగళం క్యాంప్ సైట్ పై దాడి చేశారు. దాదాపుగా యాభై మందిని అదుపులోకి తీసుకు్నారు. 


 





 
   
అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే రూట్‌లో  వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు.. రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో రాజకీయ గొడవలు పెద్దగా జరగవు. లోకేష్ పాదయాత్రపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని తిరగబడితే.. కేసులు పెట్టి లోకేష్ సిబ్బందిని అరెస్ట్ చేయాలన్న లక్ష్యంతోనే చేశారని అంటున్నారు. 


 





 


పోలీసులు పూర్తిగా ఒక వైపు మాత్రమే చూస్తున్నారని.. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి.. అసలు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టకుండా బాధితులపైనా విరుచుకుపడుతున్నారని మండిపడుతున్నారు. పోలీసులకు దెబ్బలు తగిలినా అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


అందర్నీ అరెస్ట్ చేసిన తర్వాత ఉదయం పోలీసులు లోకేష్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన  రెచ్చగొట్టే  ప్రసంగాలు చేస్తున్నారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.