Telangana News: రోజురోజుకూ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరిగుతుండడంతో.. ఆర్టీఏకు అనేక లాభాలు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ హవా ఎక్కువగా కొనసాగుతోంది. తమకు ఇష్టమైన నంబర్లను దక్కించుకోవడానికి.. వాహనాలు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మరీ నంబర్ ప్లేట్ లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్ కు ముందే రవాణా అథారిటీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్స్ వేలం ద్వారా ఏకంగా రూ.53.9 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది చివరి  నాటికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.72 కోట్లకు పైగా ఆదాయం పొందవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే పోయిన సంవత్సరంం ఆర్టీఐ ఆర్జినంచిన మొత్తం రూ.72.7 కోట్లు. వాహన యజమానులు ఎక్కువగా ఇష్టపడమే నెంబర్లలో 9999, 0001, 0007, 0009 నెంబర్లు టాప్ స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలో 9999 నెంబర్ ను రూ.21.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఈ నెంబర్ ను సొంతం చేసుకున్నారు. ఇదే నెంబర్ ను కొండాపూర్ ఆర్టీఓ ఆఫీసులో రూ.12.1 లక్షలకు సొంతం చేసుకున్నారు. మలక్ పేటలో 9999 నెంబర్ ను రూ.9.9 లక్షలు పెట్టి మరీ దక్కించుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో 0009 నెంబర్ కు అత్యధిక బిడ్ రూ.10.5 లక్షలు పలికింది. 


ఫ్యాన్సీ నంబర్లను అధిక ధరకు కొనుగోలు చేసిన సంస్థలు ఇవే..!



  • టీఎస్ 09 జీసీ 9999 - రూ.21.60 లక్షలు (ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్)

  • టీఎస్ 09 జీడీ 0009 - రూ.10.50 లక్షలు (మెఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్)

  • టీఎస్ 09 జీడీ 0001 - రూ.3 లక్షలు (ఆంధ్రా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్)

  • టీఎస్ 09 జీడీ 0006 - రూ.1.83 లక్షలు శ్(గోయజ్ జ్యువెల్లరీ) 

  • టీఎస్ 09 జీడీ 0019 - రూ.1.70 లక్షలు (సితారా ఎంటర్ టైన్ మెంట్స్)

  • టీఎస్ 09 జీడీ 0045 - రూ.1.55 లక్షలు (సాయి పృథ్వీ ఎంటర్ ప్రైజస్)

  • టీఎస్ 09 జీడీ 0007 - రూ.1.30 లక్షలు (ఫైన్ ఎక్స్ పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)

  • టీఎస్ 09 జీడీ 0027 - రూ.1.04 లక్షలు (శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్స్) 


చాలా మంది 9 నెంబర్ ను లక్కీ నెంబర్ గా భావించి.. దీన్ని సొంతం చేసుకునేందుకు ఎంతైనా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆర్టీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆగస్టు నెలలో 9999 నెంబర్ కు రూ.21.6 లక్షలు పలికింది. ఇక 0009 నెంబర్ రూ.10.5 లక్షలు, 0001 నెంబర్ రూ.3.01 లక్షలకు అమ్ముడు పోయింది. నెంబర్ లోని అన్ని సంఖ్యలను 9 కంటే తక్కువ ఉండే నెంబర్ కోసం యజమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 02, 1223 వంటి నెంబర్లకు సైతం బిడ్డింగ్స్ వస్తున్నట్లు ఖైరతాబాద్ ఆర్టీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇందుకు కారణం యజమానులు వారి పిల్లలు పుట్టిన తేదీలు, లేదా ఎవైనా స్పెషల్ రోజులను పరిగణలోకి తీసుకోవడమే అని చెబుతున్నారు. ఈ బిడ్ లు కొన్ని సమయాల్లో రూ.1000 లేదా రూ.2000 కూడా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ప్రజలకు ఫ్యాన్సీ మోజు తెలంగాణ ప్రభుత్వ ఖజానాను నింపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.