తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనున్నాయి. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సోమవారం మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లు ఎజెంట్ల సమక్షంలో ఓపెన్ చేయనున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో 6 టేబుళ్లు, కరీంనగర్ 9 టేబుళ్లు, మిగతా చోట్లా 5 టేబుళ్లు ఏర్పాటుచేశామని వెల్లడించారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ చేస్తారన్నారు. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లని లెక్కించి, తరువాత నెక్స్ట్ ప్రయారిటీ ఓట్ల ని లెక్కిస్తారని శశాంక్ గోయల్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి వీరంగం... వాహనాన్ని కిలోమీటర్ దూరం వెంబడించిన పులి
ర్యాలీలకు అనుమతి లేదు
'కౌంటింగ్ కేంద్రంలోకి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దు. ఫలితాలు వచ్చాక ఇద్దరు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి. ర్యాలీలకు అనుమతి లేదు. మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. నల్గొండ, మెదక్ లో కౌంటింగ్ రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి' అని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన
ఆరు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్ లో రెండు స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్లు 37 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం, 1,324 ఓట్లకు 1,320 ఓట్లు నమోదయ్యాయి. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌పైన కూడా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి