సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. సంగారెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి మాణిక్యం భంగపడ్డారు. టికెట్ దక్కకున్నా సరే పోటీలో ఉంటానని ఇప్పటికే మాణిక్యం ప్రకటించారు. మాణిక్యంను గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తున్నారు. నచ్చజెపేందుకు మంత్రి హరీష్ రావు ఇంటికి వచ్చారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. సంగారెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి మాణిక్యం భంగపడ్డారు.
ఫసల్‌వాదిలోని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. సంగారెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి మాణిక్యం భంగపడ్డారు. టికెట్ దక్కకున్నా సరే పోటీలో ఉంటానని ఇప్పటికే మాణిక్యం ప్రకటించారు. మాణిక్యంను గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తున్నారు. నచ్చజెపేందుకు మంత్రి హరీష్ రావు ఇంటికి వచ్చారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరగనుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలని విమర్శించారు.
నాడు ఓటుకు నోటు - నేడు నోటుకు సీటు కాంగ్రెస్ తీరు అని తెలిపారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు అన్నారు. ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనన్నారు. సంగారెడ్డిలో ఈ సారి కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగారేస్తామన్నారు. చింతా ప్రభాకర్ గెలుపునకు కృషి చేస్తానని మాణిక్యం హామీ ఇచ్చారని హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దని సూచించారు. నీటి సుంకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీసీల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వేయి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రగతికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేసింది ఏమిలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎన్నికల గాంధీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించి ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దన్నారు. రాష్ట్ర విభజన హామీలు రాహుల్ గాంధీ ఒక్కనాడైన పార్లమెంటులో అడిగారా అని ప్రశ్నించారు.