Telangana Government Good News To Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers), హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రహమత్ నగర్‌లో నిర్వహించిన 'అమ్మ మాట - అంగన్వాడీ బాట' కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని.. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్‌గ్రేడ్
మొదటి దశలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. వాటిని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rythu Runa Mafi: రుణమాఫీకి ఇన్ని కండీషన్లా? అవి రైతులకు ప్రయోజనం లేని మార్గదర్శకాలు: మహేశ్వర్ రెడ్డి