KCR Petition in TS High Court: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఓ కేసును కొట్టివేయాలని కోరారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఓ కేసులో ఇరికించారని.. దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. రైలు రోకో సందర్భంగా తనపై కూడా పోలీసులు కేసును నమోదు చేశారని అన్నారు. ఆ రైల్ రోకో కేసులో తనను 15వ నిందితుడుగా పేర్కొన్నట్లుగా పిటిషన్ లో కేసీఆర్ తెలిపారు. తనపై నమోదయిందని తప్పుడు కేసు అని.. ఆ సమయంలో తాను రైలు రోకో కార్యక్రమంలో పాల్గొనలేదని కోర్టుకు వివరించారు. అయితే, కేసీఆర్ వేసిన పిటిషన్‌పై రేపు (జూన్ 25) హైకోర్టులో విచారణకు రానుంది.
KCR News: హైకోర్టుకు మాజీ సీఎం కేసీఆర్, తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్
Venkatesh Kandepu
Updated at:
24 Jun 2024 09:21 PM (IST)
Telangana News: తనపై నమోదైన 2011 నాటి ఓ కేసును కొట్టేయాలని మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
కేసీఆర్ (ఫైల్ ఫోటో)