Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కూడా గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం వరకు అకిరా ఎక్కువగా బయట కనిపించలేదు. కానీ ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించినప్పటి నుంచి అకిరా.. తన పక్కనే ఉంటున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో తను బాగా ఫోకస్ అయ్యాడు. అకిరాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని రేణు దేశాయ్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో తనపై కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. తాజాగా అకిరాను తక్కువ చేసి మాట్లాడినందుకు రేణు దేశాయ్.. ఒక నెటిజన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.


అకిరాపై నెగిటివ్ కామెంట్..


పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ కూడా హీరో అయితే బాగుంటుందని అభిమానులు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అకిరాకు యాక్టింగ్‌పై అసలు ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినా అకిరాను జూనియర్ పవర్ స్టార్ అనడం ఆపడం లేదు అభిమానులు. ఎప్పటికైనా అకిరాను వెండితెరపై చూడాలనే ఆశిస్తున్నారు. అలాంటి కామెంట్స్ పెట్టిన చాలామంది అభిమానులపై ఇప్పటికే రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. కానీ ఈసారి భిన్నంగా ఒక నెటిజన్ మాత్రం ‘వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా’ అంటూ అకిరాను తక్కువ చేసి మాట్లాడాడు. దీంతో రేణు కోపం కట్టలు తెంచుకుంది.


సిగ్గులేకుండా ఫాలో అవుతున్నారు..


‘‘ఇలాగేనా మీ అమ్మ నిన్ను పెంచింది? కెరీర్ ప్రారంభించక ముందే ఒక అబ్బాయి గురించి ఇలా మాట్లాడతారా? ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న అబ్బాయి గురించి ఇలా మాట్లాడొచ్చా? అసలు అర్హత అనే పదానికి అర్థం తెలుసా? ఒకవేళ తన మొహాన్ని చూపించేంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకుండా ఉండడం మంచిది. నువ్వు సిగ్గులేకుండా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ నా కొడుకు గురించి నా కామెంట్స్‌లోనే తక్కువ చేసి మాట్లాడతావా? నీలాంటి మనుషులను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారా అని అసహ్యం వేస్తుంది. నా కామెంట్స్ కొంతమందికి మాత్రమే పరిమితం. అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే నా పోస్టులకు కామెంట్స్ చేయగలరు’’ అంటూ అతడిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు రేణు దేశాయ్.




నాశనం చేయగలను..


‘‘వేరేవాళ్ల పోస్టులపై కామెంట్స్ చేసే ముందు నీకు కాస్త బుద్దిని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకుంటాను’’ అన్నారు రేణు దేశాయ్. ఈ కామెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేశారు. ‘‘నా గురించి మీరు ఏం మాట్లాడినా నేను భరిస్తాను. కానీ నా పిల్లలపై విషం చిమ్మాలనుకుంటే మాత్రం మీరు ఒక తల్లితో డీల్ చేస్తున్నారని మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని నాశనం చేయగలను’’ అంటూ అందరికీ ఒకేసారి వార్నింగ్ ఇచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం తను ఇచ్చిన ఈ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను మాత్రమే కాకుండా పవన్ ఫ్యాన్స్ సైతం అకిరాను తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు.



Also Read: విజయశాంతి ఈజ్ బ్యాక్ - కళ్యాణ్ రామ్ సినిమాలో Vyjayanthi IPSగా యాక్షన్ అదరగొట్టారుగా!