Vijayashanthi: విజయశాంతి ఈజ్ బ్యాక్ - కళ్యాణ్ రామ్ సినిమాలో Vyjayanthi IPSగా యాక్షన్ అదరగొట్టారుగా!

Vijayashanthi First Look In NKR21: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

Continues below advertisement

Vijayashanthi Role And First Look From NKR 21 Revealed: విజయశాంతి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పవర్ ఫుల్ యాక్షన్ రోల్స్ గుర్తుకు వస్తాయి. లేడీ సూపర్ స్టార్ బిరుదు అందుకున్న తొలి కథానాయిక ఆవిడ. అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటించడంతో పాటు శక్తివంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ఆవిడ చేశారు. కొంత విరామం తర్వాత మళ్ళీ పవర్ ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

'వైజయంతి ఐపీఎస్'గా విజయశాంతి!
విజయశాంతి టాప్ 10 ఫిలిమ్స్ తీస్తే... ఆ జాబితాలో 'కర్తవ్యం' సినిమా తప్పకుండా ఉంటుంది. నిజాయతీ గల పోలీస్ అధికారిగా వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఆవిడ కనబరిచిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మరోసారి ఆ పాత్రతో ఆవిడ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ 21వ చిత్రమిది. అందుకని, NKR 21 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి కూడా నటిస్తున్నారు. ఆవిడ వైజయంతి ఐపీఎస్ రోల్ చేస్తున్నారు.

విజయశాంతి పుట్టిన రోజు (Vijayashanthi Birthday) సందర్భంగా ఇవాళ సినిమాలో ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ''వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫార్మ్ కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం... నేనే తన సైన్యం'' అంటూ విజయశాంతి పాత్రను నందమూరి కళ్యాణ్ రామ్ పరిచయం చేశారు.

Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు

వైజయంతిగా విజయశాంతి పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పిన కళ్యాణ్ రామ్... తాను ఆమె సైన్యం అని చెప్పడం ద్వారా కథానాయకుడి క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ అని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... ప్రభాస్ సినిమాలో కురుక్షేత్రంలో యుద్ధవీరుడిగా... ఆయన రోల్ ఏమిటంటే?


నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రధారి. సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, కూర్పు: తమ్మిరాజు, స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా.

Continues below advertisement