దళితబంధును హుజూరాబాద్‌ నియోజకవర్గం, వాసాలమర్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయడంపై సన్నాహక సమావేశాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నియోజకవర్గాల్లో అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారకొండ మండలం ఒకటి. సీఎం ప్రకటించిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తోపాటు పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతామని ఇటీవల సీఎం ప్రకటించారు.తొలి విడతలో చారకొండ మండలం ఎంపికైంది. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి,  సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆయా జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు హాజరవుతారు. చారకొండ మండలంలో దళితబంధు అమలు ద్వారా మండలంలోని 1246 ఎస్సీ కుటుంబాలకు రూ.124.60కోట్ల లబ్ధి చేకూరనుంది.


Also Read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..


2016లో ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో వంగూరు, కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలాల పరిధిలోని పలు గ్రామాలతో చారకొండ మండలం ఏర్పాటైంది. చారకొండ, సిర్సనగండ్ల, తిమ్మాయిపల్లి, కమ్లాపూర్‌, జూపల్లి, గోకారం, సేరి అప్పారెడ్డిపల్లి, మర్రిపల్లి, తుర్కపల్లి, అగ్రహారంతండా, రామచంద్రాపురం, జేపల్లి, సారంబండతండా, చంద్రాయన్‌పల్లి, ఎర్రవల్లి, శాంతిగూడెంతండా, గైరాన్‌తండా పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలంలోని 1,246 కుటుంబాలకు దళితబంధు అమలు చేసేందుకు రూ.124.60 కోట్లు ఖర్చు పెట్టనుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో చారకొండ ఒకటి. దళితబంధు పథకం అమలుతో ఇక తమ సమస్యలు తీరుతాయని స్థానికులు భావిస్తున్నారు.


Also Read: 'అఫ్గాన్'లో ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. తాలిబన్ల సంచలన ప్రకటన


అసలేంటీ దళిత బంధు: 'దళిత బంధు' అనే ఈ పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకులో వేస్తారు. మొదటి దశలో తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 11,900 మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలనుకున్నారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ డబ్బును సొంత వ్యాపారానికి ఖర్చు పెట్టుకోవచ్చంటూ 47 రకాల వ్యాపారాలను కూడా సూచించింది. డెయిరీ ఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, బార్లు, వైన్ షాపులు కూడా నిర్వహించవచ్చు. ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టుకుని పెద్ద వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది.


Also Read: ఈ రాశి ప్రేమికులకు కలిసొచ్చే రోజు…ఆ రాశుల వారికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త…మిగిలిన రాశుల వారి ఫలితాలు చూద్దాం..


Also read: ఖబడ్దార్ కేసీఆర్! నీ దొర పోకడలు సాగనివ్వను, నీ మెదడు మత్తుతో మొద్దుబారిందా? వైఎస్ షర్మిల ధ్వజం


Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధార‌ణ‌ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మ‌న‌దేశంలో లాంచ్!